ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం అనేది నాయ‌కులకు అంత తేలిక కాదు. మారిన రాజ‌కీయాలు.. మారుతున్న ప్ర‌చారం.. నేత‌ల దూకుడు వంటివి ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీ టికెట్ ఇచ్చిన క్ష‌ణం నుంచి ఇత‌ర పార్టీల నాయ‌కులు టెన్ష‌న్ ఫీల‌వుతూ ఉంటారు. ఏం జ‌రుగుతుందో అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. త‌మ స‌త్తాను నిరూపించుకునేందుకు ప్ర‌త్య‌ర్థిపై విజ‌యం ద‌క్కించుకునేందుకు అనేక రూపాల్లో ప్ర‌య‌త్నాలు కూడా చేస్తుంటారు. ఈ త‌ర‌హా ప‌రిణామాలు అన్ని పార్టీల్లోనూ స‌ర్వ‌సాధార‌ణం. అయితే.. వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కుడు, మంత్రి ఆళ్ల నాని ఈ విష‌యంలో ప్ర‌శాంతంగా ఉన్నార‌ట‌.

వాస్త‌వానికి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీ జోరు పెరిగింది. అనేక మంది నాయ‌కులు.. పార్టీని గెలిపించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీంతో జిల్లాలోని వైసీపీ గెలిచిన స్థానాల‌లో నాయ‌కులు మ‌ళ్లీ గెలుస్తామా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రికి వారు.. త‌మ త‌మ అంచ‌నాలు స‌రిపోల్చుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు మామూలుగా ఉండ‌వ‌ని.. మ‌రింత పోరు పెరుగుతుంద‌ని.. ముఖ్యంగా టీడీపీ-జ‌న‌సేన‌లు పొత్తు పెట్టుకుంటే.. ఆ ప్ర‌భావం మరింత ఎక్కువ‌గా త‌మ‌పై ప‌డుతుంద‌ని.. వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే, మంత్రి ఆళ్ల‌నాని మాత్రం నిబ్బ‌రంగా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు ఎదురు లేక‌పోవ‌డ‌మేన‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఒక‌ప్పుడు.. బ‌డేటి బుజ్జి.. ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున‌ ప్రాతినిధ్యం వ‌హించారు. అయితే.. ఆయ‌న అకాల మ‌ర‌ణం త‌ర్వాత‌.. టీడీపీ పుంజుకున్న ప‌రిస్థితి క‌నిపిస్తున్నా.. ఓటు బ్యాంకు ప్రభావితం చేసేస్థాయిలో ప‌రిస్థితిలేద‌ని.. మంత్రి ఆళ్ళ నాని భావిస్తున్నార‌ట‌. అంటే.. త‌న గెలుపున‌కు ఎలాంటి ఇబ్బందులు రావ‌ని ఆళ్ళ నాని అంచ‌నాలు వేసుకుంటున్నారు. అంతేకాదు.. తాను నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నాన‌ని.. సో..త‌న‌నే ప్ర‌జ‌లు మ‌ళ్లీ గెలిపిస్తార‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఏలూరు అసెంబ్లీలో ఈ సారి  ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: