అసలు ఎన్నికలై కరెక్ట్‌గా రెండున్నర ఏళ్ళు అయ్యాయి...మరి ఇప్పటినుంచే నెక్స్ట్ ఎన్నికల గురించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. పైగా రాజకీయ పార్టీలు సైతం..ఇప్పటినుంచే నెక్స్ట్ ఎలా గెలవాలనే వ్యూహాలని రెడీ చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉంది...అయినా సరే నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వస్తారనే చర్చ వస్తుంది. నెక్స్ట్ జగన్ మళ్ళీ వస్తారా.. చంద్రబాబు ఈ సారి గెలవకపోతే కష్టమే అని మాటలు ఎక్కువ జనాల నుంచి వినిపిస్తున్నాయి.

అయితే ఏది ఎలా జరిగినా మళ్ళీ జగనే వచ్చేస్తారనే చర్చ ప్రజల నుంచి వస్తుంది. కానీ ఆయనని తిట్టుకునే జనం కూడా ఎక్కువగానే ఉన్నారు...అసలు ఇదేం పాలన...అంతా నాశనమైపోయిందని మాట్లాడుకుంటూనే...అబ్బే మళ్ళీ జగనే వచ్చేస్తారండి అని అంటున్నారు. ఆఖరికి కొందరు టీడీపీ అనుకూలంగా ఉండేవాళ్లు కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఇక తాజాగా ఇండియా టుడే సర్వేలో కూడా జగనే మళ్ళీ అధికారంలోకి వస్తారని తేలడంతో తమ్ముళ్ళు ఇంకా భయపడే పరిస్తితి వచ్చింది.

మళ్ళీ జగన్ గెలిస్తే ఇంకా టీడీపీ ఉండదేమో అని భయపడుతున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాలని, లేకపోతే ఇంకా పార్టీ ఉండదని అనుకుంటున్నారు. అదే సమయంలో జగన్ చాప్టర్ క్లోజ్ ఇంకా వచ్చేది టీడీపీనే అని కొందరు తమ్ముళ్ళు ధీమాగా ఉన్నారు..కాకపోతే ఏదొక మూల ఎలాగైనా జగన్ అధికారంలోకి వచ్చేస్తారనే భయం ఉంది. స్థానిక ఎన్నికల్లో చేసినట్లు...సాధారణ ఎన్నికల్లో కూడా చేస్తారని, పైగా అధికారంలో ఉన్నారు...అధికారులు కూడా వారి వైపే ఉంటారు.

అలాగే డబ్బులు కూడా విపరీతంగా పంచి పెట్టేస్తారని, అదే సమయంలో టీడీపీని ఆర్ధికంగా దెబ్బకొట్టేస్తారని తమ్ముళ్ళు భయపడుతున్నారు. జనంలో వ్యతిరేకత ఉన్నా సరే పోలింగ్ బూత్ దగ్గర కూడా వారిని మార్చేస్తారని అనుకుంటున్నారు. అంటే జగన్ ఏం చేసి అయిన మళ్ళీ గెలిచేస్తారేమో అని తమ్ముళ్ళు డౌట్ పడుతున్నారు. మరి చూడాలి తమ్ముళ్ళ భయం నిజమవుతుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: