తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య అనూహ్య మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే...అధినేత చంద్రబాబు పార్టీలో పలు మార్పులు చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీ గెలవడమే లక్ష్యంగా నేతలని రెడీ చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో సత్తా చాటలేరు అనుకునే నేతలని ఇప్పుడే సైడ్ చేసేస్తున్నారు. అలాగే తాము సత్తా చాటలేము అనుకునే వాళ్ళు నిర్మొహమాటంగా తప్పుకోవచ్చని, డైరక్ట్‌గానే చెప్పేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు.

ఈ క్రమంలోనే ఏజెన్సీ నియోజకవర్గమైన అరకులో కూడా మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అరకులో టీడీపీ బలం తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. పైగా ఇక్కడ టీడీపీ నేత, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అడ్రెస్ లేరు....గత ఎన్నికల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకుని శ్రావణ్...వైసీపీ అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయారు. అసలు నియోజకవర్గంలో పనిచేస్తున్నారో లేదో కూడా క్లారిటీ లేదు..మొదట్లో కాస్త యాక్టివ్‌గానే పనిచేశారు..మరి మధ్యలో ఏమైందో తెలియదు గాని, సడన్‌గా పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం మానేశారు.

ఇదే సమయంలో ఎస్టీ సెల్ అధ్యక్షుడు దొన్ను దొర దూకుడుగా పనిచేస్తున్నారు...పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టీడీపీ బలోపేతం కోసం దొన్ను దొర కృషి చేస్తున్నారు. అలాగే ఈయన అరకు సీటు కోసం ట్రై చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది..గత ఎన్నికల్లో ఈయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి శ్రావణ్ కంటే ఎక్కువగానే ఓట్లు తెచ్చుకున్నారు. దాదాపు 27 వేల ఓట్ల వరకు తెచ్చుకున్నారు.

అందుకే దొన్ను దొర మళ్ళీ అరకులో పోటీ చేయడానికి చూస్తున్నారు..అయితే చంద్రబాబు సైతం దొన్ను దొర వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే శ్రావణ్ ఎలాగో యాక్టివ్‌గా లేరు. ఇదే పరిస్తితి కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అరకులో టీడీపీ గెలవదు. అందుకే ఇప్పుడే క్యాండిడేట్‌ని మార్చేయాలని బాబు చూస్తున్నారు. దాదాపు అరకు సీటు దొన్ను దొరకు ఫిక్స్ చేసేలా ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: