ఈరోజు ఒక టిఫిన్ చేయాలన్న కూడా మినిమమ్ 20 రూపాయలు ఉంటుంది. అంతకన్నా తక్కువ అంటే 15 రూపాయలు ఉంటుంది. ఎవరికి ఉన్నంత లో వాళ్లు తిండిని తింటారు. అయితే ఈరోజుల్లో అతి తక్కువగా తినాలని అంటే ప్రభుత్వం అందించె ఆహారపదార్థాలను తీసుకోవాలి. అది ఐదు రుపాయాలు ఉంటుంది. కానీ అంతకన్నా తక్కువగా టిఫిన్ ఇప్పుడు దొరుకుతుందని అంటున్నారు. అది ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే.. నిజంగానే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇది అక్షరాల నిజం..


రుపాయికె దోస, ఎర్రకారమ్ అందజెస్తుంది.. ఓ వృద్ధ మహిళ.. ఆమెకు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. అందులో వచ్చిన పైసలతోనే ఆ హోటల్ ను నడుపుతుంది.. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆ వృద్దురాలు కథ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధికి చెందిన వెంకట్రామిరెడ్డి, సావిత్రమ్మ దంపతులు. వీరికి చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మీదేవి, సరళ సంతానం. 40 ఏళ్ల కిందట వెంకట్రామిరెడ్డి టీ బంకు పెట్టుకుని జీవనం సాగించేవాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని వెంకట్రామిరెడ్డి భార్య సావిత్రమ్మ ఇంటి వద్ద బంకు ఏర్పాటు చేసుకుని దోసెలు వేయడం మొదలు పెట్టింది..


మొదట్లో దోస పావలా ఉంది. రాను రాను వస్తువుల ధరల ఆకాశాన్నంటుతున్నా రూపాయికే దోసె విక్రయిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు.వచ్చిన సంపాదనను కుటుంబానికి, పిల్లల చదువులకు ఖర్చు చేసింది. వీధిలోని వారు, చుట్టుపక్కల పేదలు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ దోసెలు తినేవారు.ఎర్రకారం, బొంబాయి చట్నీ కాంబినేషన్‌లో దోసె ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సావిత్రమ్మ వయసు 70 సంవత్సరాలు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి సంతోషంగా జీవనం గడుపుతోంది.. ఆమె నేను బ్రతి ఉన్నంత కాలం ఇలానే అందరి కడుపు నింపుతాను అని చెప్పుకొచ్చింది..


మరింత సమాచారం తెలుసుకోండి: