కల్లు తాగితే అదో రకమైన కిక్కు ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒంట్లో వుండే వేడిని తగ్గిస్తుంది. అందుకే వీటికి డిమాండ్ కూడా భారీగానె ఉంటుంది.  అయితే చాలా రకాల కల్లు తెలుగు రాష్ట్రాల లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా తాటి కల్లు, ఈత కల్లు కామన్. ఇంకా అక్కడక్కడా వేప కల్లు , చింత కల్లు పేర్లే ఇప్పటివరకు విన్నాము.. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణాలో మరో కల్లు అందుబాటు లొకి వచ్చింది. దానికి డిమాండ్ కూడా ఎక్కువే.. అదేంటో ఒకసారి చూడండి...


తెలంగాణాలో ఈ మధ్య జీలుగు కల్లుకు డిమాండ్ భారీగా పెరిగింది. కల్లు ప్రియులు పోటీ పడి మరీ లొట్టలు వేసుకుంటూ అక్కడికి క్యూ కడుతున్నారు. ఈ కల్లు కోసం ముందే ఫ్రీ బుకింగ్ కూడా చేసుకోవడం విశేషం.. సీసా 500 రూపాయలకు సైతం కొనేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇంత డిమాండ్ ఎందుకంటే జీలుగు కల్లు తాగితే కిడ్నీ రాళ్ళ సమస్యలు షుగర్, బిపి లాంటి సమస్యలు కూడా దరిచెరవని అంటున్నారు.


అంత ఆరోగ్యం వున్న ఈ కల్లు ఇప్పుడు సూర్యాపేటలో ఇది బాగా ఫెమస్ అయ్యింధి.. జీలుగు కల్లు వాడుకలో ఉండటంతో సైదులు జీలుగు చెట్లకు కల్లు గీయడం నేర్చుకుని అక్కడి నుండి జీలుగు విత్తనాలు తీసుకొచ్చి గ్రామం లో నాటాడు. నాటిన చెట్లలో కొన్ని మాత్రమే నాటు కోగా గత మూడేళ్లుగా ఒక చెట్టు కల్లును ఇస్తుంది. మిగితా వాటితో పోలిస్తే రుచిగా ఉండటం తో అందరు ఎక్కువగా తాగుతున్నారు.. ధర ఎంతైనా సరే చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. జీలుగు కల్లు రుచి చూసిన వాళ్ళు తమ దగ్గర దొరికే తాటి, ఈత కల్లు కోసం రావడం తగ్గించారని కార్మికులు వాపొతున్నారు.. ఇది జీలుగు కల్లుకు వున్న ప్రత్యేకత..


మరింత సమాచారం తెలుసుకోండి: