సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పెళ్లి ఒకేసారి జరుగుతుంది.  అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తెలిసీ తెలియని బంధువులందరికీ కూడా పిలిచి సర్వాంగ  సుందరంగా ముస్తాబు చేయబడిన మండపంలో బంధుమిత్రులు కుటుంబసభ్యుల ఆశీర్వచనములతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లి విషయంలో ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు అనే చెప్పాలి. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే ఘనంగా వివాహం చేసుకునే వారు. ఇటీవలి కాలంలో సామాన్యులు సైతం తమ వివాహాన్ని సరికొత్తగా ఘనంగా జరుపుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే పెళ్లికి ముందు వెడ్డింగ్ కార్డు లని పంచటం జరుగుతూ ఉంటుంది. సకుటుంబ   సమేతంగా తమ పెళ్ళికి విచ్చేసి ఆశీర్వచనాలు అందించాలి అని రాసి ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్లి చేసుకోబోయే నూతన వధూవరులు మాత్రం మా పెళ్లి కి రావద్దు అంటూ అందరికీ విజ్ఞప్తి చేశారు. అయితే ఏకంగా వెడ్డింగ్ కార్డు లో మా పెళ్లి కి రావద్దు అంటూ రాయడం గమనార్హం. అదేంటి పెళ్లి కి రావద్దు అంటూ రాసి వెడ్డింగ్ కార్డులు పంచడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. దీనికంతటికీ కారణం కరోనా వైరస్. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరు మా పెళ్ళికి రావద్దని ఉన్నచోటు నుండే  ఆశీర్వచనాలు అందించాలి అంటూ ఓ కొత్త జంట వెడ్డింగ్ కార్డు లో రాయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఘటన కర్ణాటకలోని చామరాజు నగర జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


 బంధువులు స్నేహితులు ఇతర ఆత్మీయులకు వెడ్డింగ్ కార్డులను సామాజిక మాధ్యమాల ద్వారా పంపించారు యువ జంట. ఇక తమ పెళ్ళికి దయచేసి రావద్దు ఉన్నచోటునుంచి ఆశీర్వచనాలు ఇవ్వండి అంటూ అభ్యర్థించారు. బీసీ హోసూరు గ్రామస్తులు సుష్మా చెన్నప్ప నాపుర కు చెందిన శ్రేయస్ ల వివాహం శని ఆదివారాలు జరగాల్సి ఉంది. మూడువేల మందికి వివాహ పత్రికల్ని అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఘనంగా వివాహం చేసుకుంటే వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పెళ్లికి ఎవరు రావద్దంటూ బహిరంగంగానే విజ్ఞప్తి చేసింది ఈ కొత్త జంట. ప్రతి ఒక్కరికి ఈ అభ్యర్థులను సామాజిక మాధ్యమాలలో పంపించడం గమనార్హం. మీ ఆరోగ్యం మాకు ముఖ్యం అందుకే పెళ్లి కి రాకుండా మీ ఆశీర్వచనాలు అక్కడి నుంచి ఇవ్వండి అంటూ పెళ్లి చేసుకోబోయే యువతి యువకులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: