విశాఖ ఉక్కు పరిరక్షణ  పోరాట కమిటి కీలక సమావేశం జరిగిందని...స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్షలు చేసామన్నారు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సి హెచ్ నరసింగరావు. 150 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కరోనా వల్ల మృతి చెందారని.. ఈ పరిస్థితి లో కూడా 700 కోట్లు లాభాలు వచ్చాయని పేర్కొన్నారు.  వచ్చే నెల 12 తో ఏడాది అవుతుందని... 365 జెండాలను పట్టుకుని నిరసన ప్రదర్శన చేపడతామని ప్రకటన చేశారు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సి హెచ్ నరసింగరావు. వచ్చే నెల 13న ఉద్యమం ఏడాది పూర్తియిన సందర్భంగా బీజేపీ కార్యాలయం ముట్టడి ఉంటుందన్నారు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సి హెచ్ నరసింగరావు. 

ఫిబ్రవరి 23 న విశాఖ నగరం తో పాటు..రాష్ట్ర బంద్  అని ప్రకటన చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ ఉంటుందని చెప్పారు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సి హెచ్ నరసింగరావు. 16,500 కుటుంబాల త్యాగం స్టీల్ ప్లాంట్ వెనుక ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన పెట్టుబడి తప్ప బిజెపి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇంత ఉద్యమం జరుగుతుంటే ఐతే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం..లేదా తీసేస్తాం అంటున్నారని చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పోరాట స్ఫూర్తి తెలియాలని మరింత ఉదృతంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సి హెచ్ నరసింగరావు. కరోనా సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ అందించామని... దీపం పేరు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలి అనుకున్నారో ఆ పధకం తోనే బిజెపి దీపం ఆరిపోవడం ఖాయమని పేర్కొన్నారు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సి హెచ్ నరసింగరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: