ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు ఓటర్లను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. ఆటు వాళ్లు ఇటు, ఇటువాళు అటు మారడం మామూలు వార్తలైపోయాయి అక్కడ. సమాజ్ వాదీ పార్టీ తాజాగా మరో అంశంలో వార్తల్లోకి ఎక్కింది. మమ్మల్ని అందరూ తలెత్తుకు చూడాలంటోది. ఏందుకో తెలుసా ?
 సమాజ్ వాదీ పార్టీ ప్రత్యర్థులకే కాదు, ఓటర్లందరూ కూడా తలెత్తు తిరిగే పరిస్థితి కల్పిచింది.
భారత్ లోని ఉత్తరాదిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో అక్కడంతా రాజకీయ సందడి నెలకొంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పలువురు మంత్రులతో పాటు శాసన సభ్యులు అధికార భారతీయ జనతా పార్టీని వీడి మాజీ ముఖ్యమంత్రి, సమాజా వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు మద్దుతు ప్రకటించారు. అంతే కాదు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కూడా. బిజేపి కూడా ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తోంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ తో పాటు అఖిలేష్ సమీప బంధువులను బిజేపిలో చేర్చుకుంది.
ఐదు రాష్ట్రాలలో ఎన్నికల సందడి కొనసాగుతుండగా, త్వరలో జరగనున్నఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది వారాలు మిగిలి ఉండగానే చాలా మంది కొత్త ముఖాలు రాజకీయ పార్టీల్లో చేరుతున్నారు. ఇటీవలి వార్తలలోకి ఎక్కిన వ్యక్తి  ధర్మేంద్ర ప్రతాప్ సింగ్. భారతదేశంలోని అత్యంత పొడవైన వ్యక్తి గా పేరుగడించారు. తాజాగా ధర్మేంద్ర ప్రతాప్ సిగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈయన ఇటీవల పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్ వాదీ పార్టీ  సామాజిక మాధ్యమాల్లో ఇలా రాసింది, “ప్రతాప్‌గఢ్‌కు చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ , అఖిలేష్ యాదవ్ నాయకత్వం , ఆయన  విధానాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ సమాజ్ వాదీ పార్టీ సభ్యత్వాన్ని పొందారు. అని పేర్కోంది. ఉత్తర భారతాన ఎన్నికల్లో వస్తాదులు  చాలా మంది పోటీ చేస్తున్నారు. ఇదేమీ ఈ ఎన్నికల్లో  కొత్తకాదు. చాలా కాలం నుంచి జరుగుతున్నదే. తాజాగా అన్ని రాజకీయ పక్షాలు కూడా వీరికి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు చేశాయి. మల్లయుద్దంలో విజయ బావుటా ఎగుర వేసిన వారు ఎన్నికల యుద్దంలో ఓటమి పాలైన సంఘటనలు ఉత్తర ప్రదేశ్ లో చాలానే ఉన్నాయి. తాజాగా ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో చేరారు . ఆయన ఏ మేరకు జనాల్ని ఆకర్షించి ఓటు సంపాదించి పెడతారో కాలం నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: