భ్రష్టుపట్టిపోతారు..నాశనమై పోతారు.   అణగద్రోక్కాలని చూడొద్దు... ఇవీ ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు బహిరంగంగా పెట్టిన శాపనార్దాలు. ఇది ఎక్కడో జరగ లేదు. విజయవాడ కేంద్రంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు ఏపి పాలకులనుద్దేశించి  చేసిన వ్యాఖ్యలు. ఇంతకీ ఎవరా ఎం.ఎల్.సి ? ఆయన ఎందుకు చేశారీ వ్యాఖ్యలు ?
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు పిఆర్సీ సాధన సమితి విజయవాడలోని ఎన్జీవో కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణ పై సమాలోచనలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సవరించిన నూతన పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలిలో పిడిఎఫ్ సభ్యుడు గా ఉన్న లక్ష్మణ రావు హజరయ్యారు. ఉద్యోగ సంఘాలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరును, పాలనా విధానాన్ని విమర్శించారు. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగలు పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కోంటూ... అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గతం చేయకుండానే పీఆర్సీ ప్రకటించడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. ఎన్నడూ చరిత్రలో లేని విధంగా ఏపీ పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పిఆర్సీ నివేదికలు ఎప్పుడు బహిర్గం చేస్తారో సెలవివ్వాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు కూడా ప్రభుత్వంలో భాగమని పేర్కోంటూ, వారంతా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా,  ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతున్నారని తెలిపారు.ఇది ఎంత వరకూ సబబని లక్ష్మణ రావు ప్రశ్నించారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నదని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు తమ సత్తా చూపే సమయం ఆసన్నమైందని పేర్కోంటూ, ప్రభుత్వానికి ఈ విషయం త్వరలోనే తెలుస్తుందని తెలిపారు. పోరాటం ద్వారానే డిమాండ్లు పరిష్కారం అవుతాయని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

mlc