కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ ల ఏర్పాటు, తదితర ప్రాజెక్ట్ లకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలన్నారు మంత్రి కేటీఆర్‌. చేనేత, జౌళి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయెల్‌లకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఇదే అంశంపై మంత్రి గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (KMTP) కోసం నిధుల మంజూరు:


వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి  రూ 897.92 కోట్లు మంజూరు చేయాలని, దాంతోపాటు ప్రాజెక్టుకు అనుమతి త్వరగా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. KMTP వంటి భారీ ప్రాజెక్ట్‌లు సముచితంగా లబ్ది పొందేందుకు వీలుగా 'టెక్స్‌టైల్ మరియు అపెరల్ సెక్టార్ తయారీ ప్రాంతాల అభివృద్ధి (MRTA)' విధానాన్ని ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.  “తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో 1200 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ అయ్యే విధంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ‘ఫైబర్ టు ఫ్యాషన్’ కాన్సెప్ట్ ఆధారంగా, అత్యాధునిక  సౌకర్యాలతో  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నట్టు ఆయన చెప్పారు.

 సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు:

 సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని, ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ 993.65 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం  రూ.  49.84 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు.  సిరిసిల్లలోని టెక్స్‌టైల్ పార్క్, చేనేత,  అపెరల్ పార్క్  ల నిర్వహణకు, వివిధ ఖాళీలను పూరించడానికి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆధునీకరణ మరియు ఉత్పత్తి స్థావరాన్ని విస్తరించడం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి & సామర్థ్యం పెంపుదల మరియు పరిపాలన, అధ్యయనాల నిమిత్తమై కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని లేఖలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ktr