టీడీపీ అధినేత చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్న విషయం తెలిసిందే..ఈ సారి అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో బాబుకు బాగా తెలుసు..మళ్ళీ పార్టీకి భవిష్యత్ ఉండదు..ఆ విషయం అర్ధం చేసుకుని, బాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఈ సారి జాగ్రత్తగా పనిచేస్తూ...టీడీపీ నేతలకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ, నియోజకవర్గాల్లో వైసీపీకి చెక్ పెట్టేలా పనిచేయిస్తున్నారు. అలాగే అవసరమైన చోట అభ్యర్ధులని కూడా మార్చుకుంటూ వస్తున్నారు...ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని మార్చేశారు..అలాగే మరికొన్నిచోట్ల కూడా బలమైన అభ్యర్ధులని పెట్టాలనే దిశగా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే తన సొంత జిల్లా చిత్తూరులో కూడా చంద్రబాబు...కొన్ని నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్ధులని పెట్టారు. ఇంకా కొన్ని చోట్ల అభ్యర్ధులని ఫిక్స్ చేయాలి. సత్యవేడు, పూతలపట్టు, చిత్తూరు లాంటి స్థానాల్లో టీడీపీకి అభ్యర్ధులని పెట్టాలి....అలాగే తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీకి అభ్యర్ధులని పెట్టాల్సిన అవసరం ఉంది.

అయితే తిరుపతిలో పనబాక లక్ష్మీ ఉన్న విషయం తెలిసిందే. ఆమె 2019, 2021 ఉపఎన్నికలో కూడా తిరుపతి నుంచి పోటీ చేసి ఓడిపోయారు...తిరుపతి పక్కాగా వైసీపీకి కంచుకోటగా ఉండటంతో, టీడీపీ గెలుపు సాధ్యం కావడం లేదు. అయితే భవిష్యత్‌లో కూడా తిరుపతి పార్లమెంట్‌లో టీడీపీ గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి...ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే, తిరుపతిలో మాత్రం వైసీపీ హవాని తగ్గించడం కష్టమే. అందుకే పనబాక సైతం ఉపఎన్నికలో ఓడిపోయాక కాస్త యాక్టివ్‌గా ఉండటం తగ్గించారు.

అదే సమయంలో ఆమె నెక్స్ట్ వేరే సీటులో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు పార్లమెంట్‌లో ఎలాగో టీడీపీకి అభ్యర్ధి లేరు. ఆ సీటులో నిలబడితే కనీసం గెలవడానికి అవకాశాలు ఉంటాయి...అదే సమయంలో కుప్పంలో వచ్చే మెజారిటీ కలిసొస్తుంది. లేకపోతే తిరుపతి పరిధిలో ఉండే గూడూరు గాని, సూళ్ళూరుపేట గాని పనబాక అడుగుతున్నట్లు సమాచారం. గతంలో గూడూరులో పనబాక భర్త కృష్ణయ్య పనిచేశారు. మరి చూడాలి చంద్రబాబు...పనబాక సీటు మారుస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: