కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం....వైసీపీకి కంచుకోట..ఇందులో ఎలాంటి డౌట్ లేదు..అసలు ఇక్కడ టీడీపీ గెలిచి చాలా ఏళ్ళు అయిపోయింది...ఎప్పుడో 1999 ఎన్నికల్లో మాత్రమే నంద్యాలలో టీడీపీ గెలిచింది...ఇక మధ్యలో భూమా ఫ్యామిలీ వల్ల 2017 ఉపఎన్నికలో గెలిచింది. ఇక దానికి చాలా స్టోరీ ఉంది...దానికంటే ముందు నంద్యాల 1999 నుంచి టీడీపీకి అనుకూలంగా లేదనే చెప్పాలి. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది..అయితే 2014లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి..తర్వాత టీడీపీలోకి వచ్చారు.

అయితే టీడీపీలోకి వచ్చిన ఆయన అనారోగ్యంతో మరణించారు...దీంతో 2017లో నంద్యాల ఉపఎన్నిక వచ్చింది..ఈ ఉపఎన్నికలో భూమా ఫ్యామిలీ నుంచి బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు..ఇక అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటం...డబ్బులు కూడా గట్టిగానే ఖర్చు పెట్టడంతో ఉపఎన్నికలో గెలిచిందని ప్రత్యర్ధులు ఇప్పటికీ ఆరోపిస్తారు. సరే ఎలాగోలా ఉపఎన్నికలో టీడీపీ గెలిచింది..కానీ ఆ వెంటనే జరిగిన 2019లో టీడీపీ చిత్తుగా ఓడింది.

2017 ముందు వరకు టీడీపీలో పనిచేసిన శిల్పా మోహన్ రెడ్డి తనయుడు...శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయం సాధించారు. తన తండ్రికి జరిగిన పరాజయానికి రివెంజ్ తీర్చుకున్నారు. 2017 ఉపఎన్నికలో మోహన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు...దానికి 2019లో రివెంజ్ తీర్చుకున్నారు. ఇక ఇప్పటికీ నంద్యాలలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది..పైగా నియోజకవర్గంలో రెడ్డి వర్గం హవా ఎక్కువగా ఉంది...దీంతో వైసీపీ బలం తగ్గడం లేదు.

నంద్యాలలో టీడీపీని బలోపేతం చేయడానికి భూమా బ్రహ్మానందరెడ్డి గట్టిగానే పనిచేస్తున్నారు...ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ఈ పోరాటం సరిపోదనే చెప్పాలి..ఇంకా పోరాడాల్సిన అవసరముంది. అదే సమయంలో భూమా ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి రావాలి...కలిసికట్టుగా పనిచేస్తే నంద్యాలలో గాని, ఆళ్లగడ్డలో గాని టీడీపీ పికప్ అవుతుంది. ఇక ఇప్పుడున్న పరిస్తితుల్లో నంద్యాల నియోజకవర్గంలో వైసీపీదే పైచేయి...మరి నెక్స్ట్ ఎన్నికల్లోపు నంద్యాల లో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: