కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం నియోజకవర్గంలో ఎప్పుడు టఫ్ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ నియోజకవర్గంలో మొదట నుంచి రెండు ఫ్యామిలీల మధ్యే వార్ నడుస్తోంది..అది కూడా కాపు, బీసీ నేతల మధ్య పోటీ రసవత్తరంగా నడుస్తూ ఉంటుంది. అలా అని నియోజకవర్గంలో కులాల మధ్య పోటీ ఉండదు...ఏదో నాయకుల వరకే కాపు, బీసీలే మధ్య పోటీ ఉంటుంది గాని, ఓటర్ల పరంగా అదేం ఉండదు.

మొదట నుంచి మచిలీపట్నం రాజకీయాల్లో కాపు వర్గానికి చెందిన పేర్ని ఫ్యామిలీ హవా ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. గతంలో పేర్ని ఫ్యామిలీ కాంగ్రెస్‌లో పనిచేసింది..పేర్ని కృష్ణమూర్తి కాంగ్రెస్‌లో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కృష్ణమూర్తి తనయుడుగా రాజకీయాల్లోకి వచ్చి పేర్ని నాని 2004 నుంచి సత్తా చాటుతున్నారు. 2009 వరకు కాంగ్రెస్‌లో పనిచేసిన నాని..తర్వాత వైసీపీలో సత్తా చాటుతున్నారు. 2014లో ఓడిపోగా, 2019లో గెలిచి మంత్రిగా దూసుకెళుతున్నారు.

ఇక పేర్ని ఫ్యామిలీకి ప్రత్యర్ధులుగా బీసీ నేతలు ఉన్నారు..గతంలో టీడీపీ నుంచి నడకుదిటి నరసింహారావు పలుమార్లు మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నరసింహారావు అల్లుడు కొల్లు రవీంద్ర బందరు టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 2009లో ఓడిపోయినా సరే..2014లో గెలిచి మంత్రిగా పనిచేశారు....ఇక 2019 ఎన్నికల్లో కొల్లు ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు బందరులో పేర్ని, కొల్లుల మధ్య వార్ నడుస్తోంది...అయితే అధికారంలో ఉండటంతో పేర్ని హవా ఉంది...కానీ నిదానంగా కొల్లు బలం పెరుగుతుంది. ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు...ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు..మధ్యలో రెండు, మూడుసార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇదే కొల్లుకు బాగా అడ్వాంటేజ్ అయింది. రాజకీయ కక్షతోనే జైలుకు పంపించారనే సానుభూతి ఆయనపై వచ్చింది. కాబట్టి ఈ సారి బందరులో బీసీ నేత అయిన కొల్లు రవి పైచేయి సాధించేలా ఉన్నారు. కాకపోతే ఇక్కడ జనసేన బట్టి రాజకీయం మారేలా ఉంది...పొత్తు ఉంటే టీడీపీకి ప్లస్ లేకపోతే వైసీపీకి ప్లస్. చూడాలి మరి నెక్స్ట్ జనసేన పాత్ర ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: