టి. జీవన్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు...దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నేత. ఇండిపెండెంట్‌గా గ్రామ స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన జీవన్ రెడ్డి..తొలుత ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరి 1983లో జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత ఎన్టీఆర్‌తో విభేదించి టీడీపీని వీడి...రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇక 1985లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి...1989లో గెలిచారు. మళ్ళీ 1994లో ఓడిపోగా, 1996 ఉపఎన్నిక, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా జగిత్యాలలో గెలిచారు. ఇక 2009లో మళ్ళీ టీడీపీ చేతిలో ఓడిపోయారు. 1994, 2009 ఎన్నికల్లో ఎల్ రమణ చేతిలోనే ఓడిపోయారు.

తెలంగాణ వచ్చాక జరిగిన ఎన్నికల్లో జగిత్యాల నుంచి మరొకసారి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో అనూహ్యంగా జీవన్ రెడ్డికి ఓటమి ఎదురైంది. దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ గెలిచారు. సంజయ్ గెలుపుకు కేసీఆర్ తనయురాలు కవిత కృషి చేశారు. కవిత సపోర్ట్‌తోనే సంజయ్, జీవన్ రెడ్డిని ఓడించారు.

ఇలా ఓటమి పాలైన జీవన్ రెడ్డి..ఆ వెంటనే కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్‌పై గెలిచారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ తరుపున పోరాడుతున్నారు..పి‌సి‌సి అధ్యక్ష పదవి రాకపోయినా సరే పార్టీ కోసం నిలబడుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగిత్యాలలో నిలబడి సత్తా చాటాలనే కసితో పనిచేస్తున్నారు. అయితే ఈ సారి జగిత్యాలలో కవిత పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కవిత బరిలో దిగితే జీవన్ రెడ్డికి టఫ్ ఫైట్ ఎదురవుతుంది. కానీ జగిత్యాలలో జీవన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కవితకు కూడా చెక్ పెట్టే సత్తా జీవన్ రెడ్డికి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: