తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు...ఎలాగైనా కేసీఆర్‌కు చెక్ పెట్టి తెలంగాణ గడ్డపై తొలిసారి కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలోని బీజేపీ నేతలు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఎక్కడకక్కడ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా రాజకీయంగా బలపడటానికి అందివచ్చిన అవకాశాలని వాడుకుంటూ ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ సరికొత్త స్ట్రాటజీలతో ముందుకెళ్ళేందుకు చూస్తుందని తెలుస్తోంది...బలమైన నేతలంతా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. అలాగే బీజేపీ నలుగురు ఎంపీలు సైతం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని సమాచారం. ఎలాగో కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపురావులు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారే...వీరు మళ్ళీ 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది. కిషన్ రెడ్డి..తన సొంత నియోజకవర్గం అంబర్‌పేటలో, బాపురావు...ఖానాపూర్ అసెంబ్లీలో, బండి సంజయ్..కరీంనగర్ అసెంబ్లీ లేదా వేములవాడలో పోటీ చేయొచ్చని తెలుస్తోంది.

ఇక నిజామాబాద్ ఎంపీగా ఉన్న ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ సైతం...నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారని తెలుస్తోంది. ఎలాగో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగవు..అసెంబ్లీ ఎన్నికలు ముందే వస్తాయి కాబట్టి.. అరవింద్, ఆర్మూర్ అసెంబ్లీ బరిలో దిగుతారని తెలుస్తోంది.

ఆర్మూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు..ఇక జీవన్‌, అరవింద్‌ల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. పైగా ఆ మధ్య అరవింద్‌కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని జీవన్ సవాల్ విసిరారు. దీంతో అరవింద్ ఆర్మూర్ బరిలో దిగడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. పైగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్మూర్ స్థానంలో అరవింద్‌కు మెజారిటీ వచ్చింది. అందుకే ఆ స్థానంలోనే బరిలో దిగాలని ఎంపీ అరవింద్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: