ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఒక మధురానుభూతి. ప్రేమ ఏ వయసులో పుడుతుంది అని ఎవరూ చెప్పలేరూ. నేటి రోజుల్లో కుర్రకారు మేము ప్రేమకు ప్రతిరూపం అంటూ చెబుతూ ప్రేమ ప్రేమ అంటూ తిరుగుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో మేము యువకులం కాకపోయినా ప్రేమకు అతీతం కాదు ఇటీవలి కాలంలో ఎంతో మంది వృద్ధులు నిరూపిస్తున్నారు. అయినా ప్రేమించడానికి వయస్సుత్తో పనేముంది అని అనుకుంటున్నారు. మనసులో ప్రేమ పుట్టాలే కానీ వయసుతో సంబంధం లేకుండా ప్రేమను బయట పెట్టి పెళ్లి చేసుకోవచ్చు అని ఇటీవల కాలంలో ఎంతో మంది వృద్ధులు కాస్త లేటు వయసులో పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. యువకుడిగా ఉన్నప్పుడు ప్రేమ అనేది తెలియక ముందే పెద్దలు పెళ్లి చేసేసారు. చేసుకున్న భార్యతోనే కాలం గడుపుతూ వచ్చాడు ఆ వృద్ధుడు. కానీ భార్య దూరమైంది అతను ఒంటరి వాడిగా మారిపోయాడు.  ఇంతలో ఒక బామ్మ పరిచయమైంది. అచ్చంగా సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించినట్లు గానే ఇద్దరు వృద్ధుల మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి చూపులు కలిసాయి మనసులు దగ్గరయ్యాయి. ఇక ఒకరంటే ఒకరికి ఇష్టం బాగా పెరిగి పోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 85 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే ఈ పాడు సమాజం ఏమనుకుంటుందో అని అనుకున్నప్పటికీ సమాజం గురించి ఆలోచించడం కంటే తమ ఆనందమే ముఖ్యం అని అనుకున్నారు.


 చివరికి ఎంతో ధైర్యంగా ముందడుగు వేశారు. ఇక 85 ఏళ్ల వృద్ధుడు ప్రపోజ్ చేయగా 65 ఏళ్ల బామ్మ యాక్సెప్ట్ చేసింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 85 ఏళ్ల వృద్ధుడు ముస్తఫా భార్య కొన్ని నెలల క్రితమే చనిపోయింది. తొమ్మిది మంది పిల్లలు ఉండగా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక ప్రస్తుతం ముస్తఫా ఒంటరి జీవితం గడుపుతున్నారు.. ఇంతలో ఆ తాతకి 65 ఏళ్ల ఫాతిమా అనే వృద్ధురాలు పరిచయమైంది. ఆమెకు కూడా భర్త లేడు. ఇద్దరి మనసులూ కలిసాయి ఒకరినొకరు బాగా అర్ధం చేసుకున్నారు దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  ఇటీవలే  పెళ్లితో ఒక్కటయ్యారు. మరోసారి ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: