ప్రస్తుతం పాకిస్థాన్లో రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటి పైకి వచ్చేసాయి. ఈ క్రమంలోనే ఇక ఇమ్రాన్ ఖాన్ ని గద్దె దింపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నాయి దాదాపు డజన్ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఇమ్రాన్ఖాన్ కు వ్యతిరేకంగా ముందుకు సాగుతూ ఉండటం గమనార్హం. ఇలా పిడిఎం అనే ఒక కూటమిగా ఏర్పడి ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లాంగ్ మార్చ్ చేపట్టాలని ప్రతిపక్ష కూటమి నిర్ణయించింది. ఇక ఈ లాంగ్ మార్చ్  నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


ప్రతిపక్ష పార్టీలన్నీ పిడిఎం కూటమిగా ఏర్పడి మార్చిలో చేపట్టదలచిన లాంగ్ మార్చ్ పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించాడు. ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని తనపై ఒత్తిడి పెడితే మాత్రం తాను ఇంకా ప్రమాదకారిగా మారుతానంటూ ప్రతిపక్షాలకు హెచ్చరికలు జారీ చేశాడు ఇమ్రాన్ ఖాన్. ఇక ప్రతిపక్ష పార్టీల కూటమి తలపెట్టిన యాత్ర విఫలమవుతోందని జోస్యం చెప్పాడు ఇమ్రాన్ ఖాన్. ఒకవేళ నేను రంగంలోకి దిగి వీధుల్లోకి వస్తే ప్రతిపక్ష పార్టీలు కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షనేత షేబాజ్ షేరిఫ్ పై కూడా నిప్పులు చెరిగారు ఇమ్రాన్ ఖాన్. షేబాజ్ షేరిఫ్ దేశద్రోహిగా కనిపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


 ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటున్నాయని.. కానీ  నేను ఉండగా అలాంటివి జరగడానికి ఎక్కడ అవకాశం ఇవ్వనూ అంటూ ఇమ్రాన్ ఖాన్  వ్యాఖ్యానించారు. ఇక ఇమ్రాన్ ఖాన్ విమర్శల పై స్పందించిన ప్రతిపక్ష పార్టీల నేతలు తాటాకు చప్పుళ్ళకు భయపడేదేలేదు అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అందుకే ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ విమర్శించారు. ఇక ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఓటమికి సంకేతంగా భావిస్తున్నాము అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: