ఫాస్ట్ డెలివరీ అనేది జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఎటువంటిది ఆర్డర్ చేసినా కూడా నిమిషాల్లో ఇంటికి చేర్చె కొన్ని డెలివరీ సంస్థలు అందుబాటు లో ఉన్నాయి. డెలివరీ స్టార్టప్లు క్విక్ కామర్స్ పై ఫోకస్ చేశాయి. కొన్ని సిటీల్లో కేవలం పది నిమిషాల్లో డెలివరీ ఇస్తున్నాయి. ఇలా స్పీడ్ గా డెలివరీ ఇచ్చే సంస్థలు రోజు రోజుకు ఎక్కువ పుట్టుకొస్తున్నాయి. ఆ డెలివరీ ఇచ్చే ఉద్యోగులు చాలామంది ప్రాణాలు ను రిస్క్ చేసి మరీ ఉద్యోగాలు చేస్తున్నారు.


కొన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ను పాటించడం లేదనే ఫిర్యాదులూ వస్తున్నాయి. ఫలితంగా యాక్సిడెంట్లు జరిగి ఆస్పత్రులు పాలవుతున్నారు.. అయిన కుటుంబ పోషణ కోసం తప్పక ఉద్యోగులు ఇలాంటి రిస్క్ చెస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్డ్వంటి బడా కంపెనీలు ఎగబడుతున్నాయి. సాఫ్ట్బ్యాంకు కు చెందిన మరో డెలివరీ స్టార్టప్ బ్లింకిట్, దీని పోటీ కంపెనీ జెప్టో కూడా క్విక్కామర్స్లో దూసుకెళ్లడాని కి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రిస్క్ చేసే జాబ్ అనే చెప్పాలి.


అమెరికా వంటి దేశాల్లోనూ డెలివరీ స్టార్టప్లు క్విక్ డెలివరీలు ఇస్తున్నాయి కానీ అక్కడి రోడ్లు విశాలం గా ఉండటం, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించడం వల్ల  అక్కడ ఎటువంటి సమస్యలు వుండవు. కానీ మన దేశం లో మాత్రం అలా కాదు ఇండియా లో మాత్రం రోడ్లు సరీగ్గా లేవు. సిటీల్లో రోడ్లు గుంతల తో కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే స్పీడ్ బ్రేకర్లు ఉంటున్నాయి. రోడ్ల పై నీళ్లు నిలవడం సర్వసాధారణం. అందుకే ఇప్పుడు మన దేశంలొ రిస్క్ ఎక్కువ.. డెలివరీ ఇవ్వక పోతే ఉద్యోగం ఎక్కడ పోతుందో అని ఇలా తొందర పడి ప్రాణాల ను కొల్పొతున్నారు.. ఈ బాధ్యత ఎవరదీ.. అనేది ప్రశ్నగా మారింది. అందుకే ఇలాంటివి తప్పక ఆలోచించాలి. ప్రభుత్వం ఎన్నో ఆలోచనలు చేయాలనీ సదరు ఉద్యొగ్యులు వాపొతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: