చైనాతో స్నేహం శ్రీలంకకు అనుకోని విపత్తు తీసుకొచ్చి పెట్టింది. నక్క జిత్తుల మారి చైనా కుట్రలు అర్థం చేసుకోలేకపోయిన శ్రీలంక ప్రస్తుతం ఒక్క బోర్లా పడిపోయింది. చైనా కుట్రలు అర్థం చేసుకుని తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం శ్రీలంక దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. చైనాతో స్నేహం చేసి భారత్ను విస్మరించిన శ్రీలంక ఇప్పుడు భారత్ చేసిన ఆర్థిక సహాయం తోనే బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోసారి చైనాను నమ్మకూడదు అని శ్రీలంక కు బుద్ధి వచ్చేసింది. ఆర్థిక  సహాయం పేరుతో అన్ని దేశాలనూ చైనా చెప్పుచేతుల్లో పెట్టుకుంటూ ఉంటుంది అన్న విషయం  తెలిసిందే.



 అచ్చంగా ఇలాగే భారత్కు మిత్ర దేశమైన శ్రీలంకను కూడా ఆర్థిక సహాయం పేరుతో భారీగా అప్పులు ఇచ్చి తమ వైపుకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే భారత్ నుంచి కాకుండా చైనా నుంచి ఎన్నో ఎరువులను కొనుగోలు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకుంది శ్రీలంక. కానీ చైనా కు సంబంధించిన నాసిరకం ఎరువుల కారణంగా శ్రీలంకలో వ్యవసాయ రంగంలో తీవ్ర నష్టం వాటిల్లింది.. ఇక వ్యవసాయ రంగమే ప్రధాన ఆదాయంగా ఉన్న శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు కనీసం కరెంటు ఉత్పత్తి కోసం ఆయిల్ నిల్వలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది.



 దీంతో కష్టాల్లో ఉన్న శ్రీలంకను మరోసారి ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం భారత్ చేసిన ఆర్థిక సహాయం తోనే ఆయిల్ నిల్వలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది శ్రీలంక. ఈ క్రమంలోనే  దేశ వ్యాప్తంగా విడుతల వారీగా కరెంటును వాడుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉండటం గమనార్హం. శ్రీలంక దేశంలోని కొన్ని నగరాల్లో కేవలం పది గంటలు మాత్రమే కరెంటు వాడుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. గ్రామాల్లో 12 గంటలు కరెంట్ వాడుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేస్తుంది శ్రీలంక ప్రభుత్వం. ఇలా శ్రీలంక దారుణమైన  ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి ఒకరకంగా చైనా కారణమని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: