పంజాబ్ లో ఒక్కో అభ్య‌ర్థి ఖ‌ర్చు న‌ల‌భై ల‌క్ష‌లు..వినేందుకే ఇంత‌! ఇక పోల్ సీన్ ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ ఈ ఖ‌ర్చు ఇంకా పెరిగిపోవ‌డం ఖాయం. ఇక మ‌ణిపూర్, గోవా లాంటి ప్రాంతాల‌లో అయితే అభ్య‌ర్థి ఖ‌ర్చు ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం ఇర‌వై ఎనిమిది ల‌క్ష‌లు.. ఇది కూడా పెరిగిపోవ‌డం ఖాయం ముందున్న కాలాన‌! ఈ త‌రుణంలో యూపీ ఎన్నిక‌ల ఖ‌ర్చు ఇంకేపాటి ఉండ‌నుందో మీరే అంచ‌నా వేసుకోండి.అతి పెద్ద ప్ర‌జా స్వామ్య యుద్ధంలో అక్క‌డ పెరిగే ఖ‌ర్చ‌కు, వ‌చ్చే రాబ‌డికి ఏమ‌యినా సంబంధం ఉంటుందా?



రెండు ప్ర‌ధాన పార్టీలు  బీజేపీ, కాంగ్రెస్ అదేవిధంగా మ‌రికొన్ని ప్రాంతీయ పార్టీలు రానున్న కాలంలో పెద్ద యుద్ధ‌మే చేయ‌బోతున్నాయి. ఎన్నిక‌లు ఎలా ఉన్నా ఖ‌ర్చుకు సంబంధించి అభ్య‌ర్థుల్లో హ‌డ‌లు మొద‌ల‌యిపోయింది. ముఖ్యంగా పార్టీల మ‌ధ్య ఉన్న పోటీ కార‌ణంగానే బ‌ల‌మైన అభ్య‌ర్థులకూ ఖ‌ర్చు త‌ప్ప‌డం లేద‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. దీంతో ఎన్నిక‌ల వ్య‌యం అదుపు అన్న‌ది ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాని ప‌ని అని తేలిపోయింది.


ఎన్నిక‌లు అన‌గా ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం అని అంద‌రికీ తెలిసిందే! కానీ ఈ సారి ఎన్నిక‌ల‌కు ఖ‌ర్చు బాగా ఎక్కువ‌య్యే విధంగానే ఉంది. ఎందుకంటే అభ్య‌ర్థుల‌ను ఎన్నిక‌ల సంఘం కొన్ని నిబంధ‌న‌లు పేరిట నియంత్రిస్తోంది.వీటి ప్ర‌కారం ర్యాలీల‌కు, బ‌హిరంగ స‌భ‌ల‌కు అస‌లు ఆస్కార‌మే లేకుండా పోయింది.దీంతో రానున్న ఎన్నిక‌ల్లో డిజిట‌ల్ ప్ర‌చారానికే ఎక్కువ వెచ్చించేందుకు అభ్య‌ర్థులు శ్ర‌ద్ధ చూపుతున్నారు.ఎలానూ అంద‌రి ద‌గ్గ‌రా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి క‌నుక ఈ త‌ర‌హా ప్రచారంతో ఓట‌ర్ల‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేస్తున్నారు.

ఇక ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించి మొత్తం వ్య‌యం 3500 కోట్ల రూపాయ‌లు అని తేలింది.ఇంత‌మొత్తంలో ఖ‌ర్చు చేస్తే కానీ ఎన్నిక‌లు అయ్యాయ‌ని అనిపించ‌వా? ఏమోమ‌రి! ప్ర‌స్తుత ఎన్నిక‌ల భార‌తంలో వినిపిస్తోన్న ఖ‌ర్చు వివ‌రం ఇదే కావ‌డం విశేషం. ముఖ్యంగా మ‌ణిపూర్,గోవాల‌లో ఎన్నిక‌ల ఖ‌ర్చు చాలా ఎక్కువ‌గానే ఉండ‌నుంద‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. ఇంత ఖ‌ర్చు చేశాక అధికారంలోకి వ‌చ్చాక వీళ్లంతా సాధించేదేంట‌న్న ప్ర‌శ్న ఒక‌టి ఉత్ప‌న్నం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp