ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీకి తలనొప్పులు ఎక్కువయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లో  రైతుల నిరసన కార్యక్రమంపై కేంద్ర మంత్రి కుమారుడు కారు దురుసుగా నడుపుకెళ్లి పలువురి మృతికి కారణమైన సంఘటన మరువక ముందే మరో మంత్రి కుమారుడు యధేచ్ఛగా కాల్పలకు తెగబడ్డాడు. ఎక్కడో తెలుసా ?
తాజా ఘటన  ఉత్తర ప్రదేశ్  జరగ లేదు. జరిగి ఉంటే మరింత నష్టం బిజేపి జరిగేది.  ఈ తాజా సంఘటన బీహార్ లో జరిగింది. బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ మాంత్రి నారాయణ్ ప్రసాద్ నివాసం చంపార్ జిల్లా హర్దీయా గ్రామంలో ఉంది. ఆయన ఇంటికి పరిసరల్లోని ఓ మామిడి తోటలో కొందరు పిల్లలు క్రికేట్ ఆడుకుంటున్నారు. వారితో మంత్రి కుమారుడు కూడా  క్రికేట్ ఆడారు. గేమ్ మధ్యలో క్రీడాస్పూర్తి లోపించి, వారి మద్ద వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మంత్రి కుమారుడు తన తండ్రి సిబ్బందిని, అనుచరులను  వెంట బెట్టుకుని వెళ్లి తోటి క్రీడాకారులతో గొడవ పడ్డాడు. సహ ఆటగాళ్లను చికత బాదాడు. అంతటితో ఆగక వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారికి చికిత్సనిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా తీవ్రంగా గాయపడిన వ్యక్తి మరణించారని స్థానికులు పేర్కోంటున్నారు. గాయపడిన వ్యక్తి మరణించారా ? లేదా ? అన్న విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించ లేదు. మంత్రి కుమారుడి  చర్య పై గ్రామస్తులు ఆగ్రహించారు. మూకుమ్మడిగా వెళ్లి మంత్రి ఇంటిని చుట్టుముట్టారు.  దీంతో మంత్రి కుమారుడు అతని అనుచరులు అక్కడ నుంచి పరారయ్యారు. గ్రామస్తులు మంత్రి నివాసంలో ఫర్నీచర్ ను ద్వంసం చేశారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తీసుకు వచ్చారు. ఈ విషయమై మంత్రి నారాయణ్ ప్రసాద్ స్పందించారు. గ్రామస్తులు తమ పై దాడికి దిగారని, తన ఆస్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతి ఆరోపణలు చేశారు. తన కుమారుడికి గన్ లైసెన్స్ ఉందని,  అందువల్ల అతనెప్పుడూ తుపాకి చేతపట్టుకుని తిరుగుతుంటారని కుమారుడ్ని వెనకేసుకు వచ్చారు. ఈ ఘటన ఉత్తరాదిన కలకలం సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: