కరోనా వైరస్ ఉద్యోగాల పై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఎంతో మంది వైరస్ కారణంగా ఉద్యోగాలు వదిలి వ్యాపారం వైపు అడుగులు వేసేలా ఆలోచన రావడానికి కూడా కరోనా వైరస్ కారణం అని చెప్పాలి. వైరస్ కారణంగా ఎప్పుడు ఊడి పోతుందో తెలియని ఉద్యోగం  చేయడం కంటే సొంతంగా వినూత్నంగా వ్యాపారం చేస్తే బాగుంటుందనే ఆలోచన ప్రతి ఒక్కరు మెదిలింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టిన వారు ఉన్నారు. ఇలాంటి వారిలో సక్సెస్ అయిన వారు ఎక్కువ మంది.



 కష్ట సమయంలో మంచి ఉపాధి పొందడం ఎలా అని ఆలోచించి లక్షల్లో సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి కూడా ఈ కోవకే చెందుతారు. లాక్ డౌన్ సమయం లో ఉద్యోగం కోల్పోయాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతని మెదడులో ఒక ఆలోచన తట్టింది. సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను చూసి ఒక వినూత్న ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు ఆ ప్రయత్నం సక్సెస్ కావడంతో లక్షలు సంపాదిస్తున్నాడు. కేరళలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 కేరళలోని ఇడుక్కి జిల్లా రాజకుమారి గ్రామానికి చెందిన అభిజిత్ లాక్ డౌన్ లో ఉద్యోగం కోల్పోవడంతో  యూట్యూబ్లో వీడియోలు చూడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే కోడి పిల్లల ఉత్పత్తి యూనిట్ నిర్మించి స్వయం ఉపాధి పొందేందుకు ఒక సరికొత్త ప్రయత్నం చేశాడు. అయితే మొదట్లో కేవలం టైం పాస్ కోసం మాత్రమే కోడిపిల్లల ఉత్పత్తి  యూనిట్కు సంబంధించిన వీడియోలు చూసినా అభిజిత్ ఆ తర్వాత మాత్రం వాటిని ఆచరణలో పెట్టి సక్సెస్ సాధించాడు. అచ్చంగా యూట్యూబ్ లో వీడియో లో చెప్పిన విధంగా కోళ్ళ ఉత్పత్తి కేంద్రం నిర్మించడానికి కావలసిన ధర్మో స్టార్ట్, ఫ్యాన్, బల్బులు, హీటర్, టైమర్, మోటార్,  పెద్ద పెట్టను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు అభిజిత్. ఇంటి వద్దనే ఇక కోడి పిల్లల ఉత్పత్తి ప్రారంభించాడు. ఏకంగా వేళల్లో పైగా కోడి పిల్లల ఉత్పత్తి చేసినట్లు చెబుతున్నాడు ఈ యువకుడు. ఇలా వీటిని విక్రయిస్తూ లక్షల్లోనే సంపాదిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: