ఉత్తర భారత దేశాన ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడి వాతావరణం అంతా  వేడి వేడిగా ఉంది. మరీ ముఖ్యంగా పంజాబ్ లో. ఎందుకంటే ... ఇటీవలి కాలంలో కాంగ్రెస్  పార్టీ ఒక్కో రాష్ట్రాన్నీ తన ఖాతా లోనుంచి కోల్పోతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్ లోనయినా ఉన్న అధికారాన్ని నిలబట్టుకోవాలని ఆ పార్టీ తపన పడుతోంది. వాళ్లు అలా ఆశించడంలో తప్పు లేదు కూడా.
ప్రస్తుతం పంజాబ్ లో జెండా ఎగుర వేయాలని అధికార కాంగ్రెస్ ఎంత  తపన పడుతోందో, అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న  భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ రాష్ట్ర పాలకులు ఆప్ కూడా  తమ సత్తా చాటాలని ఉబలాట పడుతున్నాయి.
పంజాబ్ లో కాంగ్రెస్ ప్రచార సారథ్య బాధ్యతను  ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎందకంటే ఆయన సోదరి మాళవిక  సూద్ పంజాబ్ ఎన్నికల బరిలోఉన్నారు. ఆమె మోగా నియోజక వర్గం నుంచి తన అదృష్ణాన్నిపరీక్షించుకుంటున్నారు. ఆమె తరపున ఎన్నిక ప్రచార బాధ్యతలను సోనూసూద్ చూస్తున్నారు. నా తల్లి ప్రొఫెసర్. మానాన్ని సామాజిక కార్యకర్త, పాఠశాలలో , ధర్మశాలు నిర్వహించారు.   అది  కూడా మా సొంత డబ్బులతో, మా స్వంత భూముల్లో నిర్వహించాం. మా సోదరి మాళవికకు ఇక్కడ పెద్ద బాధ్యత ఉంది. ఇక్కడి ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆమెదే. ఈ నగరంలో టీకాల కార్యక్రమం విజయవంతం చేశాం. ఎంతో మందికి విద్య, ఉపాధి అవకాశాల విషయంలోసాయ పడ్డాం. వారంతా  సోదరి మాళవిక పై ఒత్తిడి చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే  ఆమె రాజకీయాలలోకి ప్రవేశించారు. అని సోనూ సూద్ జాతీయ మీడియా తో వ్యాఖ్యానించారు.
కాగా  కేంద్ర ప్రభుత్వ అధీనంలో ని వివిధ శాఖలు పంజాబ్ పై దృష్టి సారించాయి. అవినీతి నిరోధక శాఖ,.ఈడి తదితర సంస్థలు  బిజేపికి వ్యతిరేకంగా  ఎన్నికలలో పనిచేస్తున్న వారిపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటి దాకా రాజకీయ నాయకులందరూ సోనూసూద్ ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటారని, సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతారని భావించారు. కాని అందరి అంచనాలకు విరుద్దంగా ఆయన కాంగ్రెస్ జెండా భుజానికెత్తుకుని ప్రచారంలో పాల్గోనడం చర్చనీయాంశంగా మారింది. ఈయన ఆర్థిక మూలాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తాయా ? కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనా ? కాలం నిర్ణయించాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: