పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ కంచుకోటల్లో నరసాపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు మొదట నుంచి టీడీపీకి కంచుకోటలుగానే ఉంటూ వస్తున్నాయి. అలాంటి కంచుకోటల్లో ఇప్పుడు టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. పైగా రెండు స్థానాల్లో టీడీపీని పైకి లేపడానికి చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ రెండు స్థానాలు పొత్తులో పోతాయని అనుకుంటున్నారో లేక రఘురామకృష్ణం రాజు కోసం నరసాపురం ఎంపీ స్థానం, పవన్ కల్యాణ్ కోసం నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేయాలని అనుకుంటున్నారో మాత్రం క్లారిటీ లేదు.


అసలు రెండు చోట్ల టీడీపీ పరిస్తితి అంతగా బాగోలేదు. ముందు నరసాపురం అసెంబ్లీ స్థానం గురించి మాట్లాడుకుంటే..ఇటీవలే అక్కడ కొత్త ఇంచార్జ్‌ని పెట్టారు. అయితే ఇంచార్జ్‌ మార్చిన సరే నరసాపురంలో టీడీపీ గెలవడం గగనం అనే చెప్పాలి. ఎందుకంటే నరసాపురం అసెంబ్లీలో టీడీపీ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ వైసీపీ-జనసేనల మధ్యే ఫైట్ నడుస్తోంది. ఒకవేళ పొత్తు గాని ఉంటే ఈ సీటు ఖచ్చితంగా జనసేనకు దక్కుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఎటు చూసుకున్న నరసాపురం అసెంబ్లీని టీడీపీ వదులుకోవాల్సిందే.


అటు నరసాపురం పార్లమెంట్‌లో టీడీపీకి బలం ఉంది...కానీ అక్కడ రఘురామ కోసం త్యాగం చేయాల్సిన పరిస్తితి. రఘురామకు టీడీపీ సపోర్ట్ చేయాల్సిన పరిస్తితి. అందుకే అక్కడ ఇంకా టీడీపీ ఇంచార్జ్‌ని పెట్టలేదు. ఇప్పుడు ఎలాగో రఘురామ రాజీనామా చేస్తానని అంటున్నారు..ఇక ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరి నరసాపురంలో పోటీ చేస్తారు.


అప్పుడు టీడీపీ-జనసేనల సపోర్ట్ తీసుకుంటారు. దీంతో అక్కడ టీడీపీకి నాయకుడు ఉండరు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో పొత్తు ఉంటే ఈ సీటు కూడా వదులుకోవాల్సిన పరిస్తితి ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే నరసాపురం అసెంబ్లీ, నరసాపురం పార్లమెంట్ సీట్లని టీడీపీ వదులుకోవాల్సిందే. రెండు చోట్ల టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: