రెండు పార్టీల కీలక నేత‌లు లేదా రెండు పార్టీల‌కు సంబంధించి కీల‌కం అనుకునే నేత‌లు ఒక‌రినొక‌రు బండ బూతులు తిట్టుకుంటున్నారు. ఓ స్థాయిలో లేని భాష‌కు ఎవ‌రు ఆద్యులు అంటే ఏం చెబుతాం.ఇప్ప‌టికే చంద్ర‌బాబు ను తిట్టాల్సినంతా తిట్టారు నాని.క్యాసినో వివాదం సంద‌ర్భంగా మ‌రోసారి నాని త‌న తిట్ల క్యాసెట్టును మ‌రో సారి ప్లే చేసి మ‌రీ! వెళ్లారు.అయినా కూడా నాని కోపం ఆగ‌డం లేదు.ఇదే స‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున రంగంలోకి వంగ‌ల‌పూడి అనిత, వ‌ర్ల రామ‌య్య,బుద్ధా వెంక‌న్న కూడా తేల్చుకుందాం అంటే తేల్చుకుందాం అంటున్నారు.ఇంత‌కూ క్యాసినో క‌థ ఎప్పుడు కంచికి చేరుతుందో?

టీడీపీలో బుద్ధా వెంక‌న్న, వైసీపీలో కొడాలి శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు (నాని) ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు దూషించుకునేంత‌గా విభేదాలు ఏం పుట్టుకు వ‌చ్చాయి.ఎందుక‌ని రాజ‌కీయ రాద్ధాంతాలు? ఒక వివాదం న‌డుస్తున్న త‌రుణంలో మ‌రో వివాదం.ఇప్ప‌టికే క్యాసినో వివాదం న‌డుస్తుంది.దీనిపై నిజ నిర్థార‌ణ‌కు టీడీపీ వెళ్లింది.త‌రువాత అక్క‌డ వాతావ‌ర‌ణం అనుకూలించ‌క ర‌ణ రంగం అయిన త‌రుణాన వెనుక్కు వ‌చ్చేసింది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి బుద్ధా వెంక‌న్న న్యాయ విచార‌ణ‌కు ప‌ట్టుబ‌ట్ట‌డంలో త‌ప్పు లేదు కానీ అటు డీజీపీని ఇటు కొడాలి నానిని ఎందుక‌ని నోటికి వ‌చ్చిన విధంగా తిట్టార‌ని?

రాజ‌కీయంలో ఇంత‌గా తిట్టుకోవ‌డం,దిగజారే భాష మాట్లాడుకోవ‌డంతో ఒక‌రినొక‌రు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.అవును! సంక్రాంతి పండుగ నాటి వివాదంతో నాని వార్త‌ల్లో నిలిచారు. ఈ ఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ‌కు ఆదేశించి త‌న స‌చ్ఛీల‌త‌ను నిరూపించుకోవాల్సిన ప్ర‌భుత్వం ఎందుకనో ఆ సాహ‌సం చేయ‌డంలేదు.ఇదే అదునుగా క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పి మ‌రి! టీడీపీ నాయ‌కులు నోటికి వ‌చ్చిన భాష అంతా వాడుతున్నారు.ఈ విష‌య‌మై నానితో పోటీ ప‌డుతున్నారు. మ‌రీ! ఘోరం ఓ మాజీ ఎమ్మెల్సీ ఓ మంత్రిని ఉద్దేశించి మాట్లాడే మాట‌లేనా అవి? ఏమంటే ఆయ‌న మ‌మ్మ‌ల్ని అంటున్నారు మేం ఆయ‌న‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేస్తాం అని చెప్ప‌డం స‌భ్య‌తా? ఇదేనా టీడీపీ నేర్పుతున్న సంస్కృతి. పోనీ ఆ సీఎం అయినా త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు వారి అనుచరుల‌కు చెప్ప‌రేంటో ? ఈ వివాదంలో ఎవ‌రిది పై చేయి కాదు ఎవ‌రిది దిద్దుబాటు అన్న‌దే ముఖ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: