ఏపీలో 25 మంత్రులు ఉన్నారండి..ఆ విషయం ఎవరికైనా తెలుసా? అంటే ఏమో అండి అందరు మాకు కనబడరని జనం నుంచి సమాధానం వస్తుంది. తమకు జగన్ సీఎంగా ఉన్నారని తెలుసు. కనిపించిన, కనిపించకపోయినా ఆయన తమకు ఎప్పుడు వినిపిస్తుంటారని జనం చెబుతున్నారు. సరే జగన్ సీఎం కాబట్టి...ఆయన కనిపించిన, కనిపించకపోయినా..ఆయన పని మాత్రం కనిపిస్తోంది. కాబట్టి ఆయనని పక్కన పెడితే...మరి మంత్రులు ఎందుకు కనిపించడం లేదు. వారి పని ఎందుకు కనిపించడం లేదనే డౌట్ రావొచ్చు.

ఇక ఆ డౌట్‌లో నిజం కూడా ఉందని చెప్పొచ్చు. అసలు 25 మంత్రులు ఉన్నారు..ఆ 25 మంత్రుల్లో ప్రజల్లో తిరిగేది ఎవరు? ప్రజలకు కనిపించేది ఎవరు? ప్రజల కోసం పనిచేసేది ఎవరు? అంటే వీటికి సమాధానం ప్రజల నుంచి కాస్త ఘాటైన సమాధానాలే వస్తున్నాయి. పనిచేసే విషయంలో అందరూ అందరే అన్నట్లు ఉన్నారని అంటున్నారు. అసలు ఏ పనిచేసిన తమకు జగనే కనిపిస్తున్నారు తప్ప, మంత్రులు ఎక్కడా కనిపించడం లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.

కానీ కొందరు మంత్రులు ప్రతిపక్షాలని తిట్టే విషయంలో బాగా కనిపిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా కొడాలి నాని బాగా తెలుసని అంటున్నారు. చంద్రబాబుని ఆయనే తిట్టే తిట్లు వింటూనే ఉంటున్నారు. అలాగే పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ లాంటి వారు ప్రతిపక్షాలని తిట్టడం కోసం మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నారు.

అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, అప్పలరాజు, నారాయణస్వామి, ధర్మాన కృష్ణదాస్‌లు కనిపిస్తున్నారు. కానీ మిగిలిన వారు మీడియాలో కనిపించడం తక్కువే అంటున్నారు. విశ్వరూప్, జయరాం, శంకర్ నారాయణ, పుష్పశ్రీ, సుచరిత, వనిత, రంగనాథరాజు, అంజాద్ బాషా, వేణుగోపాల్ లాంటి వారు మంత్రులే అనే విషయం కూడా జనాలకు తెలియడం లేదు. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ అప్పులు తీసుకురావడంలో ఢిల్లీలోనే ఎక్కువ ఉంటున్నారు. ఇది ఏపీ మంత్రుల పరిస్తితి.  

మరింత సమాచారం తెలుసుకోండి: