రాజకీయాల్లో అధికారం కోసం నేతలు పార్టీలు మారడం సహజమే...అయితే పార్టీలు మారడం అనేది కొందరికి బాగానే అడ్వాంటేజ్ అవుతుంది...మరి కొందరికి పార్టీ మారడం అనేది తాత్కాలికంగా మాత్రమే అడ్వాంటేజ్ అవుతుంది...ఇంకా రాజకీయంగా అనేక ఇబ్బందులు వస్తాయి. గతంలో ఏపీలో కొందరు జంపింగ్ నేతలకు అదే జరిగింది. టీడీపీ అధికారంలో ఉందని చెప్పి..చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ కొట్టేశారు. అయితే వారు తాత్కాలికంగా అధికారాన్ని అనుభవించారు. కానీ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి శాశ్వతంగా రాజకీయాల్లో కనుమరుగయ్యే స్థితికి వెళ్ళిపోయారు.

ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. అయితే టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం వారికి అడ్వాంటేజ్ అయింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు జంపింగ్ జరిగింది...12 మంది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల గురించి పక్కనబెడితే...ఇప్పుడు కాంగ్రెస్ జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్తితి ఏంటి అనేది సరిగ్గా క్లారిటీ లేకుండా ఉంది.

సరే ఇప్పుడంటే టీఆర్ఎస్‌ అధికారంలో ఉంది కాబట్టి, అధికారాన్ని బాగానే అనుభవిస్తున్నారు. మరి నెక్స్ట్ పరిస్తితి ఏంటి? మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే వారు ఏం అవుతారు? అసలు ముందు వారికి సీటే వచ్చేలా కనిపించడం లేదు. పలువురు జంపింగ్ నేతల పరిస్తితి అలాగే ఉంది. అసలు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి వారికి సీటు విషయంలో హామీ రావడం లేదు.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలా కొందరు కాంగ్రెస్ జంపింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు దక్కే విషయంలో డౌట్లు ఉన్నాయి. ఈ సారి కారులో ఈ జంపింగ్ నేతల సీట్లు పాయే అన్నట్లు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: