పోలవరం నియోజకవర్గం మళ్ళీ ఫ్యాన్ పార్టీ వశమయ్యేలా ఉంది. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఎమ్మెల్యే బాలరాజుకు చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో వైసీపీకి పోటీగా టీడీపీ వచ్చింది. కానీ పోలవరంలో మాత్రం వైసీపీకి టీడీపీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేని పరిస్తితిలో ఉంది. అయితే మొదట నుంచి పోలవరంలో టీడీపీకి అంత బలం లేదు.

ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువసార్లు గెలిచింది..టీడీపీ నాలుగు సార్లు మాత్రమే గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో బాలరాజు వైసీపీ నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో, ఆయన దూకుడుగా ముందుకెళుతున్నారు..అసలు ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందుకెళుతున్నారు..ఈ రెండున్నర ఏళ్లలో ఎలాంటి వివాదాల్లోకి వెళ్లలేదు. అటు బాలరాజుకు చెక్ పెట్టలేని పరిస్తితుల్లో టీడీపీ కనిపిస్తోంది..అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం శూన్యం అన్నట్లు పరిస్తితి ఉంది.

2014లో ఇక్కడ టీడీపీ నుంచి మొడియం శ్రీనివాసరావు గెలిచిన విషయం తెలిసిందే...అయితే ఐదేళ్లలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆయనని పక్కన పెట్టి బొరగం శ్రీనివాసరావుని 2019 ఎన్నికల్లో నిలబెట్టారు. అయినా సరే ప్రయోజనం లేదు...అప్పటికే టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది..దీంతో బొరగం దారుణంగా ఓడిపోయారు. ఇప్పటికీ ఆయన పుంజుకోలేకపోయారు. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పికప్ అవుతున్నారు...కానీ పోలవరంలో మాత్రం బొరగం పికప్ అవ్వలేకపోయారు. పైగా ఇక్కడ టీడీపీ శ్రేణులు చాలావరకు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. అసలు స్థానిక ఎన్నికల్లో పోలవరంలో టీడీపీ ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది.

అంటే ఇప్పటికీ పోలవరంలో బాలరాజు హవా స్పష్టంగా కొనసాగుతుంది...ఇక నెక్స్ట్ ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది...అదే జరిగితే పోలవరంలో ఆయన ఇంకా బలపడతారు...అప్పుడు టీడీపీ చెక్ పెట్టడానికి అవకాశం దొరకదు. మొత్తానికి చూసుకుంటే పోలవరంలో మరొకసారి వైసీపీ జెండా ఎగిరేలా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: