ఏపీలో ఫ్యామిలీ రాజకీయాలు సహజంగానే ఉంటాయి..ఒకే ఫ్యామిలీ నుంచి రాజకీయాలు చేసే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. అసలు చెప్పాలంటే ఏపీలో మెజారిటీ నాయకులు ఫ్యామిలీ రాజకీయాల నుంచి వచ్చినవారే...అలా అంటే వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి జగన్‌తో పాటు ఇంకా పలువురు నేతలు రాజకీయం చేస్తున్నారు...అటు చంద్రబాబు ఫ్యామిలీ నుంచి కూడా లోకేష్ రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే...ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు.

అయితే బాలయ్య ఇద్దరు అల్లుళ్ళ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. లోకేష్, భరత్‌లు రాజకీయం చేస్తున్నారు. కాకపోతే లోకేష్ చంద్రబాబు వారసుడుగా ముందుకెళుతున్నారు. ఇటు భరత్...దివంగత ఎం‌వి‌వి‌ఎస్ మూర్తి మనవడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇంకో వైపు కావూరి సాంబశివరావుకు కూడా మనవడు. ఇలా బాలయ్య ఇద్దరు అల్లుళ్ళకు పోలిటికల్ బ్యాక్‌డ్రాప్ గట్టిగానే ఉంది. కానీ గత ఎన్నికల్లో బాలయ్య సక్సెస్ అయ్యారు గాని...ఇద్దరు అల్లుళ్లు సక్సెస్ కాలేదు.  

హిందూపురం నుంచి బాలయ్య రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తొలిసారి ఎన్నికల బరిలో దిగిన లోకేష్, శ్రీభరత్‌లు ఓడిపోయారు..మంగళగిరిలో లోకేష్, విశాఖపట్నం పార్లమెంట్‌లో భరత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. జగన్ గాలిని బాలయ్య అడ్డుకున్నారు గాని, లోకేష్, భరత్‌లు మాత్రం తట్టుకోలేకపోయారు. అలా తొలిసారి ఓటమి పాలైన బాలయ్య అల్లుళ్లు ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు.

రెండోసారి మాత్రం వైసీపీకి చెక్ పెట్టి తొలిసారి గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరిలో లోకేష్ ఏ విధంగా పనిచేస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి పరిస్తితులని చూస్తే మంగళగిరిలో లోకేష్‌కు విజయావకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి మాత్రం లోకేష్‌కు మంచి ఛాన్స్ ఉంది. అటు విశాఖపట్నం పార్లమెంట్‌లో కూడా భరత్‌కు గెలవడానికి ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ పవన్‌తో పొత్తు ఉంటే మాత్రం భరత్ సులువుగా గెలిచేస్తారు. మొత్తానికి ఈ సారి బాలయ్య అల్లుళ్లు విజయం సాధించేలా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk