ప్రముఖ హీరోగా కాకుండా సామాజిక సేవకుడుగా మంచి పేరున్న సోనూసూద్.. ఇప్పుడు ఓ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై సోనూ సూద్ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నారు. అయితే.. అది ఇప్పుడే కాదని సోనూసూద్‌ చెప్పారు. మరో ఐదేళ్లు సమాజ సేవ చేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని సోనూ సూద్‌ అంటున్నారు. అంతే కాదు.. ప్రజలకు సేవ చేసే గుణం మా   కుటుంబ రక్తంలోనే ఉందని అంటున్నారు సోనూసూద్.


ఇప్పటికే తనను రాజకీయాల్లోకి రావాల్సిందిగా అనేక పార్టీ ఆహ్వానించాయని సోనూ సూద్‌ గుర్తు చేశారు. ఓ పార్టీ అయితే.. రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందట. తనను రాజకీయాల్లోకి రావాలని.. తమ పార్టీలో చేరాలని చాలా పార్టీలు కోరాయని.. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని రెండు సార్లు ఆఫర్‌ చేసినా అందుకు తాను నిరాకరించానని చెప్పారు సోనూసూద్.. అయితే.. అది ఏ పార్టీ అన్న విషయం మాత్రం చెప్పలేదు.


తాను రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని.. కానీ ముందు సమాజ సేవపై మరింతగా దృష్టి పెడతానంటున్నారు. తన ఆలోచనలు నచ్చే పార్టీతో చేయికలుపుతానని.. ఈ పదవికి నువ్వే అర్హుడివి అని అందరూ అనే స్థాయికి ఎదిగాక అప్పుడు ఎన్నికల బరిలో దిగుతా అంటున్నారు సోనూ సూద్.


అయితే.. ప్రస్తుతం సోనూసూద్‌ సోదరి మాళవికా సూద్‌ పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన సోదరి తరపున ప్రచారం కూడా చేస్తున్నారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో గట్టిపోటీ నెలకొన్నావిజయం మాత్రం కాంగ్రెస్ కే దక్కుతుందని ఆయన అంచనా వేశారు. తన సోదరి మాళవికా సూద్ కు మద్దతుగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే.. ఆయన కాంగ్రెస్ కు ఓటేయాలని కాకుండా.. తన సోదరిని గెలిపించాలని అడుగుతూ ప్రచారం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: