సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం ?



అమరావతి : క్యాంపు కార్యాలయం లో వైయస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమం ప్రారంభం అయింది. ఈబీసీ నేస్తాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌.. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో ఈరోజు శ్రీకారం చుడుతున్నామని ప్రకటన చేశారు.  రిపబ్లిక్‌ డే కు ఒకరోజు ముందు ఈ కార్యక్రమం చేస్తున్నామని..  మన దేశాన్ని మన రాజ్యాంగం ప్రకారమే మనల్ని మనం పాలించుకునే రోజు ప్రారంభమైందీ.. రిపబ్లిక్‌ డే రోజున అని తెలిపారు.  రాజ్యాంగం అమల్లోకి వచ్చి రేపు 73వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని..  మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనస్సుతో నివాళులు అర్పిస్తున్నామని వెల్లడించారు. రాజ్యాంగం ఆశయాలను నెరవేరుస్తూ అడుగులు ముందుకేస్తున్నామని పేర్కొన్నారు.  రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రతి అడుగూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అడుగులు ముందుకేస్తున్నామని... వైయస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 

అగ్రవర్ణా ల్లో కూడా పేదవాళ్లు ఉన్నారని.. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని వెల్లడించారు. 3.93వేలమంది మహిళలకు ఇవాళ రూ. 589 కోట్ల రూపాయలు నేరుగా వారి అక్కౌంట్లోకి జమచేస్తున్నామని స్పష్టం చేశారు.  వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45–6 0 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాల్లోకి అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ ఈకార్యక్రమం అమలు చేస్తున్నట్లు స్పస్టం చేశారు. ప్రతి ఏటా రూ.15వేల చొప్పున  3 ఏళ్లలో రూ.45వేలు ఇస్తామని.. ఇది మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.  ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం కాదు.. మేనిఫెస్టోలో కూడా చెప్పలేదని వెల్లడించారు. పేదవాడు ఎక్కడున్నా.. పేదవాడేనని..  వారికి మంచి జరగాలనే ఉద్దేశం తో ఈ కార్యక్రమమన్నారు. ఒక మంచి అన్నగా, తమ్ముడిగా... వారికీ మంచి చేయాలనే బాధ్యత తీసుకుంటున్నానని వెల్లడిం చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: