కేసీఆర్‌ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు బిజెపి శాసనసభా పక్ష నాయకులు శ్రీ టి రాజా సింగ్.  నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి లో పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి తో పాటు బీజేపీ నాయకుల పై టీఆరెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం....  ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కనబెట్టి టిఆర్ఎస్ పార్టీ అధినేత ఇతర పార్టీల నేతలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు టి రాజా సింగ్.  రాష్ట్రంలో ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. టిఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలు నిత్యకృత్యమయ్యాయన్నారు టి రాజా సింగ్.  దాడులకు పాల్పడుతున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు పట్టించుకోకుండా ఉండడం దారుణమైన విషయమని వెల్లడించారు టి రాజా సింగ్.  దాడులు టిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తే బిజెపి కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు టి రాజా సింగ్. 

దాడుల వెనుక ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు కుట్ర ఉందనేది స్పష్టమని పేర్కొన్నారు టి రాజా సింగ్. రాజకీయంగా బిజెపిని ఎదుర్కోలేక హుజురాబాద్ దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తుండడంతో బీజేపీ కార్యకర్తల పై దాడులు చేసి  పోలీసులతో కేసులు నమోదు చేయించి జైలు కు పంపించడం ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని చెప్పారు టి రాజా సింగ్.  ఎంఐఎం  మిత్ర పక్షం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి  వారి వారసత్వంగా వచ్చిన నియంతృత్వాన్ని ప్రత్యక్షంగా బిజెపి కార్యకర్తలపై నాయకులపై చూపిస్తున్నారు నిజాం మహా రాజు అన్న కెసిఆర్ నిజాం ఆలోచన విధానం అమలు చేస్తున్నారని.. నిజాంను తరిమికొట్టిన తెలంగాణ సమాజం కెసిఆర్ ను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు టి రాజా సింగ్.  నాడు ఆర్య సమాజం పై, ఆర్ ఎస్ ఎస్ పై దాడులు చేసినా బెదరలేదు. నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తల పై దాడులకు పాల్పడ్డా భయపడమని వెల్లడించారు టి రాజా సింగ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: