మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటలేదంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉత్తరప్రదేశ్ లో అలాగే తయారైంది. ఏకంగా ప్రధానమంత్రి అభ్యర్థిని, పార్టీని నడిపించే నాయకురాలు,  ఉత్తరప్రదేశ్ లో తాట తీయబోతోంది, యోగి ఆదిత్యనాథ్ ను గద్దె దించబోతోందని తన గెలుపుతో  దేశ రాజకీయాల్లో మార్పు తేబోతోందని, ఇందిరా వారసురాలిగా  ఒక చరిత్ర సృష్టించబోతోంది అని ఇప్పటివరకు మనం  ప్రియాంక వాద్రా గురించి మాట్లాడాం. అందుకోసమే  ఆమెకు ఇందిరాగాంధీ లాగా చీర కట్టు కట్టించి, ఇప్పటివరకు  అన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఇందిరాగాంధీ  ఆలోచనా విధానాలు చాలా లోతుగా ఉండేవి. ఈమె లాగా ఒకేసారి ఆకాశం లోంచి ఊడిపడ్డట్టు వచ్చినటువంటి లీడర్ కాదు. అలాంటి లీడర్ తో ప్రియాంక గాంధీ సమానమని పోల్చడం చాలా విడ్డూరం.

ప్రస్తుతం పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా 140 కోట్ల మంది జనాభా ఆలోచన ఏమిటి, విధి విధానాలు ఏమిటి, వారి కష్టనష్టాలు ఏమున్నాయి, అనేది తెలుసుకోకుండా పూర్వ కాలం లాగానే బుజ్జగింపు రాజకీయాలకు తెర లేపుతూ ముందుకుపోతున్నారు. ఆ కాలంలో ఈ వ్యూహాలు నడిచాయి. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో వీటికి తావు లేదన్నది వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ సమయంలో కాంగ్రెస్  తప్ప వేరే పార్టీ కనబడేది కాదు. వందకి 90 శాతం మార్కులతో కాంగ్రెస్ ఉండేది, ఇంకో పది శాతంలో  సిపిఐ ఇతర పార్టీలు ఉండేవి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో ఇదే స్ట్రాటజీ ప్రియాంక వాద్రా అవలంబిస్తోంది. బీజేపీ 60 సీట్లు ఉంటే  కాంగ్రెస్ 10 సీట్లలో గెలిచింది.

 ప్రస్తుతం  జరిగే ఎన్నికల్లో అన్ని సీట్లు ఉన్న బీజేపీని ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, మహిళా సాధికారతకు తోడ్పడతామని అంటున్నారు. మరి యూపీలో మాత్రం ఇలా మాట్లాడుతూ అధికారంలో ఉన్న పంజాబ్ లో  మహిళా సాధికారత గురించి ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావడం లేదు. మొన్నటి వరకు యూపీలో గెలిచేది కాంగ్రెస్ మాత్రమే అని చెప్పి, మళ్లీ ఎస్పి తో పొత్తుకు సై అనడం  ఆలోచించాల్సిన విషయం. దీన్ని బట్టి చూస్తే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు అంత సీన్ లేదని వారికి వారే చెబుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: