మంత్రి కొడాలి నాని భాష‌కు సంబంధించి ఆయ‌న విప‌క్ష పార్టీల‌ను తిడుతున్న తీరు గురించి ఇప్ప‌టికే చాలా తీవ్ర స్థాయిలోనే చ‌ర్చ జ‌రుగుతోంది.గుడివాడ‌లో పండ‌గ రోజు తో స‌హా త‌రువాత రెండు రోజులు కూడా క్యాసినో నిర్వ‌హించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై నాని స్పందించి, త‌న‌దైన వివ‌ర‌ణ ఇచ్చినా కూడా ఆ రోజు ఏం జ‌రిగిందో అన్న విష‌య‌మై త‌మ ద‌గ్గ‌ర ఆధారాలున్నాయ‌ని,అయినా నిజ నిర్థార‌ణ కోసం ఎవ్వ‌రు గుడివాడ‌కు వెళ్లినా పోలీసులు ఎందుకు వెళ్ల‌నీయ‌డం లేద‌ని మండిప‌డ్డారు.ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో మ‌ళ్లీ రాజ‌కీయం వేడెక్కింది.తాము  కానీ బీజేపీ కానీ గుడివాడ వెళ్లేందుకు ఎందుక‌ని పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌ర‌ని టీడీపీ ప్ర‌శ్నిస్తూ, అదేమ‌యినా పాకిస్థానా వెళ్ల‌నివ్వ‌క‌పోవ‌డానికి అంటూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ మీడియా మీట్ నిర్వ‌హించింది.ఇదే సంద‌ర్భంలో త‌మ‌పై పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు కానీ మంత్రి పై ఎందుకు తీసుకోలేక‌పోతున్నార‌ని ప్ర‌శ్నిస్తూ..తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు సంబంధిత పార్టీ నాయ‌కులు.మంత్రి నాని వ్యాఖ్య‌ల‌పై తానెందుకు అలా మాట్లాడాల్సి వ‌చ్చిందో అన్న విష‌య‌మై వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న మీడియా ముందుకు వ‌చ్చారు.మ‌ళ్లీ కొడాలి నానిని ఉద్దేశించి చాలా ఘాట‌యిన వ్యాఖ్య‌లు చేశారు.



కొడాలి నానిని వెంట‌నే క్యాబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని కోరారు.అదేవిధంగా త‌మ పార్టీ నాయ‌కులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు వెంట‌నే అరెస్టు చేసి జైల్లో పెట్టాల‌ని పోలీసుల‌ను కోరారు.ఆయ‌న‌కు రాజ‌కీయ జీవితం ప్ర‌సాదించిన చంద్ర‌బాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తాము త‌ట్టుకోలేక‌పోతున్నామ‌ని అందుకే తాము కూడా అంతే స్థాయిలో అదే భాష‌లో మాట్లాడుతున్నామ‌ని బుద్ధా వెంక‌న్న అన్నారు.అదేవిధంగా త‌మ నాయ‌కుడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకుంటే తాము కూడా అదే దారిలో వెళ్లి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు మానుకుంటామ‌ని ఆయ‌న అన్నారు.నిన్న‌టి వేళ త‌న‌ను అరెస్టు చేసిన పోలీసులు కొడాలి నానిపై ఎందుక‌ని చ‌ర్య‌లు తీసుకోరు అని ప్ర‌శ్నించారు.వైసీపీ ప్ర‌భుత్వ‌మేమీ ఏళ్ల‌కు ఏళ్లు ఉండిపోద‌న్న విష‌యాన్ని పోలీసులు గుర్తించాల‌ని హిత‌వు పలికారు. ఇదే సంద‌ర్భంలో కొడాలి నాని త‌మ‌ను ఉద్దేశించే భాష ఏ విధంగా ఉందో సాక్షిలో ప్ర‌సారం అయిన వీడియోల‌ను మీడియా ఎదుట ప్ర‌ద‌ర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: