రఘురామకృష్ణంరాజు ఫుల్ క్లారిటీతో ఉన్నారండి...ఎప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేయాలి...ఏ పార్టీలో చేరాలి...ఏ పార్టీల మద్ధతుతో నరసాపురం ఉపఎన్నికల బరిలో దిగాలనే విషయాలపై రఘురామ బాగానే క్లారిటీగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి, అదే పార్టీపై రఘురామ గత రెండేళ్లుగా ఎలాంటి విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే...ఇక రఘురామ, వైసీపీల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోంది. వైసీపీని ఇరుకున పెట్టాలని రఘురామ...రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇలా వారి మధ్య వార్ నడుస్తోంది.

అలాగే ఆయనపై వేటు వేయించాలని చెప్పి వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నించింది...కానీ వైసీపీకి సాధ్యం కాలేదు. అయితే రఘురామకు ఎవరు ప్లాన్ ఇచ్చారో లేక..ఆయన డిసైడ్ అయ్యారో తెలియదు గాని, రాజీనామా చేయడానికి మాత్రం ఆయన సిద్ధమయ్యారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ నరసాపురంలో బరిలో నిలిచి గెలిచి జనంలో జగన్ పాలన పట్ల వ్యతిరేకత ఉందని చూపించాలని అనుకుంటున్నారు.

అయితే అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు...అందుకే ఆయన వ్యూహాత్మకంగా టీడీపీ-జనసేన-బీజేపీల మద్ధతుతో బరిలో దిగితే నరసాపురంలో ఈజీగా గెలిచేస్తామని అనుకుంటున్నారు. కాకపోతే రాజు గారికి కేంద్రం సపోర్ట్ కావాలి కాబట్టి బీజేపీలో చేరి, టీడీపీ-జనసేనల మద్ధతు తీసుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ఏ పార్టీలో చేరతారో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటున్నారు. దీని బట్టి చూస్తే ఆయన బీజేపీలో చేరబోతున్నారని క్లారిటీ వచ్చేస్తుంది.

అయితే బీజేపీలో చేరితే మాత్రం రాజుగారికి సపోర్ట్ చేయకూడదని, నరసాపురంలో టీడీపీ తరుపున అభ్యర్ధిని పెట్టాలని తమ్ముళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే ఓకే అని, అలా కాకుండా బీజేపీ నుంచి పోటీ చేస్తే సపోర్ట్ ఇచ్చే పరిస్తితి లేదని అంటున్నారు. కాకపోతే చంద్రబాబు మాత్రం సపోర్ట్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు. అప్పుడు తమ్ముళ్ళు ఎలా స్పందిస్తారనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: