తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు ఫైర్ బ్రాండ్ నాయకులే అని చెప్పొచ్చు. ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గాని ఫైర్ బ్రాండ్ నాయకులే. వీరు ఏ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అలాగే తమదైన శైలిలో మాట్లాడుతూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టగలిగే సామర్థ్యం ఇద్దరు నేతలకు ఉంది.

అందుకే ఈ నేతలకు ఎలాగైనా చెక్ పెట్టాలని టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అయితే వీరు అధ్యక్షులు కాకముందు అంటే...2018 ఎన్నికల్లో వీరికి టీఆర్ఎస్ చెక్ పెట్టింది. ఇద్దరినీ ఓడించింది. కొడంగల్ బరిలో రేవంత్ రెడ్డిని, కరీంనగర్ బరిలో బండి సంజయ్‌ని ఓడించారు. వరుసగా 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన రేవంత్ రెడ్డి 2018 ఎన్నికలో ఓడిపోయారు. అటు కరీంనగర్ అసెంబ్లీలో బండి సంజయ్ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఇలా ఇద్దరు నేతలని టీఆర్ఎస్ ఓడించింది. ఇక ఇలా ఓడటమే వాళ్ళకు ప్లస్ అయినట్లు ఉంది. అందుకే ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు నేతలు ఎంపీలుగా గెలిచారు. మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్‌పై గెలిచారు. అటు కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి బండి సంజయ్, టీఆర్ఎస్‌పై విజయం సాధించారు. ఇలా ఎంపీలుగా గెలిచాకే..బండికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి...అటు రేవంత్‌కు టి‌పి‌సి‌సి అధ్యక్ష పదవి వచ్చాయి.


ఇప్పుడు అధ్యక్షులుగా వారు టీఆర్ఎస్‌పై దూకుడుగా ముందుకెళుతున్నారు. ఇలా దూకుడుగా వెళుతున్న ఇద్దరు నేతలకు చెక్ పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ చూస్తుంది. ఈ సారి మళ్ళీ వారు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతారు. రేవంత్...మళ్ళీ కొడంగల్‌లో, బండి సంజయ్..కరీంనగర్ లేదా వేములవాడ బరిలో దిగే ఛాన్స్ ఉంది. కానీ ఈ సారి వీరి గెలుపుని టీఆర్ఎస్ ఆపడం కష్టమనే చెప్పొచ్చు. మరి చూడాలి వీరికి టీఆర్ఎస్ చెక్ పెట్టగలదో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: