కారు స్పీడుకు బ్రేకులు వేసి... తెలంగాణ గడ్డపై గులాబీ జెండాని కిందకు దించి కాషాయ జెండాని ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ, హస్తం జెండాని ఎగరవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలు చూస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ మరింత దూకుడుగా ఉంది. కానీ కాంగ్రెస్ దూకుడు పెంచితే బీజేపీ బలం సరిపోదు..ఎందుకంటే బీజేపీ కంటే కాంగ్రెస్‌కే బలం ఎక్కువ.

ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటే కాంగ్రెస్‌కే సాధ్యమవుతుంది. ఇక్కడ బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. అయితే నెక్స్ట్ పరిస్తితులని బట్టి చూస్తే నల్గొండలో కాంగ్రెస్ హవా కొనసాగేలా ఉంది. ఇప్పుడు కాస్త ఇబ్బందికరమైన పరిస్తితులు ఉన్నా సరే...మొత్తం మీద చూసుకుంటే నల్గొండలో కారు కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ బలం ఉంది. పైగా ఇక్కడ కాంగ్రెస్‌లో హేమాహేమీలు ఉన్నారు.

గత ఎన్నికల్లో వారు విఫలమయ్యారు గాని..ఈ సారి మాత్రం సత్తా చాటాలనే విధంగా పనిచేస్తున్నారు. ఈ సారి నాగార్జున సాగర్‌లో జానారెడ్డి సత్తా చాటేలా ఉన్నారు. ఆయన బరిలో దిగకపోయినా, ఆయన తనయుడు బరిలో దిగేలా ఉన్నారు. అటు మిర్యాలగూడలో జానారెడ్డి మరో తనయుడు పోటీ చేసే సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఉత్తమ్ దంపతులు సైతం హుజూర్‌నగర్, కోదాడ బరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా ఉన్నారు. ఈ రెండు చోట్ల కాంగ్రెస్‌కు మంచి ఛాన్స్ కనిపిస్తోంది.

అలాగే మునుగోడులో ఎలాగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి...నల్గొండ అసెంబ్లీ లేదా భువనగిరి అసెంబ్లీలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆ రెండిటిలో ఎక్కడ పోటీ చేసిన కోమటిరెడ్డికి గెలిచే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డిలకు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే నల్గొండలో కారుని హస్తం నేతలే డ్యామేజ్ చేసేలా ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

trs