మ‌న ప‌ద్మాలు అన్న‌వి ఎంతో గొప్ప‌వి
అవ‌ధాన సారం నుంచి వైద్య విజ్ఞానం వ‌ర‌కూ
కిన్నెర పాట నుంచి ఇంకా
ఇత‌రేత‌ర సాంస్కృతిక వైవిధ్యం వ‌ర‌కూ
తెలుగు వాకిట సంబరం ఈ పుర‌స్కార వైభ‌వం



అవ‌ధానిగా గ‌రికిపాటి న‌ర‌సింహారావు సుప‌రిచితులు. తెలుగు భాష‌పై వారికున్న ప్రేమ అనిత‌రం. ప‌ద్మ పుర‌స్కారం అందుకున్న సంద‌ర్భంగా వారి గురించి ఇంకొంత.. గ‌రికిపాటి న‌ర‌సింహారావు అవ‌ధానిగా, ప్ర‌వ‌చ‌న కర్త‌గా తెలుగు రాష్ట్రాల‌లోఎంతో పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప‌ద్య రీతిని సులువుగా బోధించ‌డంలో ఆధ్యాత్మిక విష‌యాలను వివేచ‌న చేయ‌డంలో వీరు సిద్ధ హ‌స్తులు. తెలుగు వారి కి ప్రాణ ప్ర‌దం, ప్ర‌త్యేకం అయిన అవ‌ధాన ప్ర‌క్రియ‌తో ఎంతో పేరు తెచ్చుకున్న‌వారు. ముఖ్యంగా వీరి ప్ర‌సంగాల్లో కానీ ప్ర‌వ‌చ‌నాల్లో కానీ వాస్త‌వ దూర విష‌యాలు అనేవి ఉండనే  ఉండ‌వు. వీలున్నంత మేర హృద‌యాల‌ను హ‌త్తుకునే భాష మ‌రియు సౌంద‌ర్యం మిళితం అయి ఉంటాయి. ప‌ద్మ పుర‌స్కారం అందుకుంటున్న వేళ వీరికి అభినంద‌న‌లు.వీరితో పాటు తెలుగు వార‌యిన కృష్ణ ఎల్లా దంపతులు, అదేవిధంగా కిన్నెర వాద్య క‌ళాకారులు ద‌ర్శ‌నం మొగుల‌య్య కూడా ప‌ద్మ పుర‌స్కారాలు అందుకున్న‌వారిలో ఉన్నారు. వీరికి తెలుగు నేల‌కు ఉన్న బంధం గురించి ప్ర‌త్యేకించి చెప్పాలి.

అంద‌రినీ క‌రోనా వ‌ణికిస్తున్న సంద‌ర్భంలో హ‌డలెత్తిస్తున్న సంద‌ర్భంలో కో వ్యాగ్జిన్ ను తెర‌పైకి తెచ్చి భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఎంతో పేరు తెచ్చుకుంది.ఈ సంస్థ ఉనికిలో మ‌రియు ఉన్న‌తిలో తెలుగు వారు అంద‌రూ ఉండడం.. ముఖ్యంగా మ‌హ‌మ్మారుల‌ను జ‌యించేందుకు కృష్ణ ఎల్ల దంపతులు చేసిన కృషి ఇవ‌న్నీ అనిత‌ర సాధ్యం. తెలంగాణ వాకిట రూపుదిద్దుకున్న ఈ వ్యాక్సిన్ కార‌ణంగా ఎన్నో స‌మ‌స్య‌ల నుంచి భారత్ మాత్ర‌మే కాదు యావ‌త్ ప్ర‌పంచ‌మే గ‌ట్టెక్కింది అని చెప్ప‌డం చాలా చిన్న మాట. ప‌ద్మ భూష‌ణ్ అవార్డుతో కృష్ణ ఎల్ల దంపతుల‌ను కేంద్రం సత్క‌రించ‌డం నిజంగానే వారి కృషికో గొప్ప గుర్తింపు. ఇక కిన్నెర వాద్యంతో అంద‌రినీ అల‌రించే మొగుల‌య్య జీవిత‌మే ఓ ఆద‌ర్శం. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాకి చెందిన మొగుల‌య్య 12 మెట్ల కిన్నెర వాద్యం వాయిస్తూ పురాణేతిహాసాల‌ను వినిపించే ప‌ద్ధ‌తే నిజంగా ఓ అద్భుతం.ఆయ‌న కృషికి మెచ్చి పురాత‌న క‌ళ‌ను కాపాడుతున్న వైనం గుర్తించి ప‌ద్మ పుర‌స్కారం ప్ర‌క‌టించ‌డం నిజంగానే ఎంతో అపురూప సంద‌ర్భం.


మరింత సమాచారం తెలుసుకోండి: