సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా అమెరికాకి వెళ్లడం అనేది ఒక కల. అయితే ఈ ఊరిలో ఉండే వారికి మాత్రం అది ఒక హోదా తో సమానమట. అందుకే 1970 ల నాటి నుంచి కూడా ఈ ఊరు నుంచి ఎంతోమంది అమెరికాకు వలస వెళ్లారు. వీళ్లకు ఆ అమెరికా అంటే ఏంత పిచ్చి అంటే... నిజానికి ఈ ఊరిలో ఉండే మొత్తం జనాభా 3000 అయితే అందులో మొత్తం 18 వందల మందికి పైగా అమెరికా పర్యటన చేసిన వారే. దీనికి  ప్రధాన కారణం... ఓ కుటుంబం అమెరికాలో ఉంది అంటే ఆ ఊరిలో వారిని చాలా ప్రత్యేకంగా చూస్తారు. మరెంతగానో గౌరవిస్తారు. ఇలా జరగడం అనేది ఈరోజుది మాత్రమే అనుకుంటే తప్పే.కొన్ని దశాబ్దాలుగా వీరు ఏదో ఒక రూపంలో అమెరికాకి చేరుకుంటున్నారు. కొంతమంది అక్కడికి పని వీసా మీద వెళ్తే.. మరి కొంతమంది ఎలా గోలా అమెరికాకు వెళ్లాలని ఏమాత్రం అనుభవం లేని ఏజెంట్లను నమ్మి బలవుతున్నారు.ఇక ఈ రెండో వర్గం వారు చచ్చినా.. బతికినా.. వూరిలో ఉండే వారికి అసలు ఏమీ పట్టదు. కేవలం వారు అమెరికా వెళ్లారు అనేమాట మాత్రమే అక్కడ మిగులుతుంది.

ఇక ఇలా కోటి ఆశలతో వెళ్లింది. జగదీష్ పటేల్ ఫ్యామిలీ. ఈ డింగుచా ఊరు నుంచి చాలామంది దొంగ దారుల్లో అమెరికా చేరుకున్నట్లుగానే వారు కూడా అమెరికాలోకి వెళ్ళాలి అనుకున్నారు. కానీ వారిని మృత్యువు మాత్రం హిమపాతం రూపంలో కబళించింది. మైనస్ 35 సెంటిగ్రెడ్ శీతలంలో శరీరాలు గడ్డగట్టుకు పోయి కెనడా అమెరికా సరిహద్దుల్లోనే వారు కన్నుమూశారు. ఇక ఈ క్రమంలోనే వారి దగ్గర ఉండే చిన్నారులు కూడా చనిపోవాల్సి వచ్చింది. అయితే వీరి డెడ్ బాడీలను గుర్తించగా అవి గుజరాత్ నుంచి అమెరికా వెళ్లాలని బయలుదేరి వెళ్లిన జగదీష్ ఫ్యామిలీది. చనిపోయిన వారిలో పటేల్ మాత్రమే గాక అతని భార్య వైశాలి ఇంకా అతని ఇద్దరు పిల్లలు విహంగ ధార్మిక్ లు కూడా ఉన్నారు. వీరు పది రోజుల క్రితం కెనడాకు వెళ్లారని వారి తరపు బంధువు చెప్తున్నారు. అయితే అక్రమ వలస ప్రకారం వారు అమెరికా దేశం సరిహద్దు దాటుకుని ఆ దేశంలోకి ప్రవేశించాలని వారి కోరిక. ఇక ఇంత లోపే ఈ దారుణం జరిగినట్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: