మనిషి తలచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు కదా. అందుకు ఈ హైబ్రిడ్ కారు నిదర్శనం. 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ హైబ్రిడ్ కారు-ఎయిర్ క్రాఫ్ట్ రెడీ అయ్యింది. 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఈ కార్ ప్రయాణించగలదు. ఇందుకు సంబంధించిన అన్ని పనులు కూడా ముగిశాయి. యోగ్యతా పత్రం కూడా రానే వచ్చింది. ఈ ధ్రువపత్రాలు స్లోవాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ఈ హైబ్రిడ్ కారు ఫిట్ నెస్ కూడా బాగుందని తెలిపింది. 70 గంటల పాటు పరిశీలించిన తర్వాత ఈ తర్ఫీదునిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ పరీక్షల్లో భాగంగా 200 టేకాఫ్ ల్యాండిగ్ పరీక్షలు చేశామని నిర్వాహకులు వివరించడం జరిగింది.ఈ హైబ్రిడ్ కారు-ఎయిర్ క్రాఫ్ట్ కు ఇక బీఎండబ్ల్యూ ఇంజిన్ ను అమర్చారు. ఈ కారుకు రెండు వైపులా చిన్న రెక్కలు ఉంటాయి.ఈ కార్ గాల్లోకి వెళ్తున్నప్పుడు ఆ రెక్కలు విచ్చుకుంటాయి.

అలా విమానం లాగా గాల్లోకి ఈ కారు దూసుకుపోతుంది. కారు రోడ్డు నుంచి గాల్లోకి వెళ్లడానికి కొంత సమయం అనేది పడుతుంది. రన్ వే మీది నుంచి టేకాఫ్ అవడానికి 2 నిమిషాల 15 సెకండ్ల టైమ్ పడుతుందని ఈ కారును తయారు చేసిన నిపుణుడు ప్రొఫెసర్ స్టీఫెన్ క్లీన్ తెలిపారు.ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చని క్లీన్ వెల్లడించడం జరిగింది. మాక్సిమం 200 కిలోల బరువును మోస్తుందని చెప్పారు.ఈ కార్ 160 కిమీ వేగంతో 8200 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ హైబ్రిడ్ కారులో వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు జర్నీ చేయవచ్చు. అయితే ఈ కారు మాత్రం డ్రోన్ మాదిరి ఎగరలేదు. ఈ కార్ టేకాఫ్ అవడానికి ల్యాండ్ అవడానికి ప్రత్యేకమైన రన్ వే అనేది ఉండాల్సిందే. ఇంకే గాల్లో ఎగిరే కారు ఇక సిద్ధం అయినట్లే. డానికి ఫిట్ నెస్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. ఇక తరువాత ప్రయాణమే. ఇలాంటి కార్లు అందుబాటులోకి వస్తే గాల్లో హ్యాపీగా చక్కర్లు కొట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: