శ్రీకాకుళం : ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవె న్యూ శాఖ మంత్రి ధర్మా న కృష్ణదాస్ షాకింగ్‌  కామెంట్స్ చేశారు..పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేస్తూ  కీలకమైన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన కృష్ణదాస్ .  వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఏవైనా అభ్యం తరాలు ఉన్నట్లయితే స్వీకరిస్తామని వెల్లడించారు మంత్రి ధర్మాన కృష్ణదాస్ . శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ కోరుకున్నట్లు ఎచ్చెర్ల   నియోజక వర్గాన్ని జిల్లా లోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని చెప్పారు మంత్రి ధర్మాన కృష్ణ దాస్ . 

అతి ముఖ్యమైన రూరల్ యూని వర్సిటీ, పారిశ్రామిక వాడ శ్రీకా కుళం జిల్లా లో నే ఉంటాయని స్పష్టం చేశారు మం త్రి ధర్మాన కృష్ణ దాస్. అటు జిల్లాల పునర్విభజన గురించి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు.  అన్నమయ్య జిల్లా ను స్వాగతిస్తున్నా, హర్షిస్తు న్నానని చెప్పారు.  భౌగోళికంగా, నైసర్గికము గా "పీలేరు" ఎటు వైపు అయినా 58 కిలోమీటర్లు కలిగి వుండడం మంచి విషయమన్నారు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. అటు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా మధ్యలో పీలేరు నియోజకవర్గం వుండడమని వెల్లడించారు.  ఆ మూడు జిల్లాలు మధ్యన పీలేరు ఏ జిల్లాకు వెళ్ళాలన్న 5౦ కిలోమీటర్ల దూరం ప్రయానం సమ తుల్యంగా వుండడం పీలేరు కు గొప్ప వరమని చెప్పారు.  తద్వారా పీలేరు నియోజకవర్గం మరింత అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నానన్నారు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp