ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. నవ రత్నాల ద్వారా అభివృద్ధి ఫలాలు అందరికి అందుతున్నాయని.. డీబీటి ద్వారా ఇప్పటి వరకు 1,67,798 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు బిశ్వభూషణ్ హరి చందన్.  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తన, ఎరువుల సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు బిశ్వభూషణ్ హరి చందన్.  ఇప్పటి వరకు 19,126 కోట్లు రైతు భరోసా ద్వారా ఆర్ధిక సాయం అందించినట్టు పేర్కొన్నారు  గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్.   ఆముల్ పాల వెల్లువ ద్వారా  9899 పాల కేంద్రాల ద్వారా పాల సేకరణ చేస్తున్నట్టు స్పష్టం చేశారు బిశ్వభూషణ్ హరి చందన్. 3177 కోట్ల వ్యయంతో 4 ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందన్నారు బిశ్వభూషణ్ హరి చందన్.  విద్యను భవిష్యత్ కు పాస్ పోర్టుగా నా  ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు 34,619 కోట్లు వ్యయం చేసిందని...  మనబడి నాడు నేడు ద్వారా దశల వారిగా పాఠశాలలు అభివృద్ధి చెప్పారు బిశ్వభూషణ్ హరి చందన్.  

ప్రాధమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ ఈ సిలబస్ ను అమలు చేస్తున్నామని.. అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది లబ్ధి దారులకు 13,023 కోట్లు చెల్లించామని వెల్లడించారు బిశ్వభూషణ్ హరి చందన్.  ఆరోగ్య పరిరక్షణ కు గ్రామ స్థాయిలో 10,032 వైఎస్సార్ క్లినిక్ లు, ఏర్పాటు చేసిందని.. ఆరోగ్యశ్రీ పధకం ద్వారా 2466 చికిత్స విధానాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు బిశ్వభూషణ్ హరి చందన్.  హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లలోని 138 ఆస్పత్రుల్లో ను ఆరోగ్యశ్రీ పధకాన్ని అందిస్తున్నామని.. కోవిడ్ నియంత్రణ లో భాగంగా ఇప్పటి వరకు 3.2 కోట్ల నిర్దారణ పరీక్షలు చేసిందని తెలిపారు బిశ్వభూషణ్ హరి చందన్.  రాష్ట్రంలో నే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసాం, పడకలు, ఐసీయూ సౌకర్యం, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నమని చెప్పారు బిశ్వభూషణ్ హరి చందన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp