అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలను శాసించిన కుటుంబాలలో నల్లపు రెడ్డి కుటుంబం కూడా ఒకటి. ఆ కుటుంబం నుంచి నల్లపు రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎం.ఎల్ ఏ వ్యవహరించారు. ఆయన సోదరుడు  నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి  మంత్రిగా పని చేశారు. శ్రీనివాసులు రెడ్డి ఆవిభక్త ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో చరిత్ర సృష్టించారు. శాసన సభ సమావేశాలకు ఒక్క రోజు కూడా గైర్హాజరు కాని నేతగా చరిత్ర పుటల్లో నిలిచి పోయారాయన. ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా కోట మండలం. అయితే నల్లపు రెడ్డి తొలిసారి గూడురు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత కోవూరు నియోజకవర్గానికి వలస వెళ్లి ఆ స్థానాన్నే తన సేఫ్ సీట్ గా మార్చుకున్నారు. ఆయన కాలం చేసిన తరువాత ఆయన వారసుడుగా నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అదే కోవూరు నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తండ్రి కాంగ్రెస్ పార్టీ ఎం.ఎల్.ఏ గా కాలం చేసినా, కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి విజయబావుటా ఎగుర వేసి రాజకీయాలలో కొనసాగారు. అయితే కాల గమనంలో కోవూరు నియోజక వర్గ ప్రజల ఆకాంక్షల మేరకు వై.ఎస్. జగన్ వెంట నడుస్తున్నారు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి  కోవూరు నియోజక వర్గం నుంచి ఐదవ సారి శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.జిల్లాలో సీనియర్ ఎం.ఎల్.ఏ గా ఉన్నారు.
కాగా కొత్తజిల్లాల ఏర్పుాటుతో నియోజక వర్గాల స్వరూప స్వభావాలు మార లేదు. అయితే ఆయన స్వస్థలం కోట పంచాయితీ  ప్రస్తుతం గూడూరు నియోజక వర్గంలో ఉంది. గూడూరు నియోజక వర్గం తిరుపతి కేంద్రంగా ఏర్పాటయ్యే బాలాజి జిల్లా లో భాగం కానుంది. ఆ విషయం అటుంచితే. కొత్త నెల్లూరు జిల్లాలో ఒక్క రిజర్వుడు స్థానం కూడా లేదు. 2021 లో జనాభా గణన జరగ లేదు. త్వరలో జనాభా గణన కూడా జరగ నుంది.  కేంధ్ర ప్రభుత్వం ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది కూడా. నూతన జనాభా గణన పూర్తయితే శాసన సభా నియోజక వర్గ పునర్ వ్యవస్థీకరణ తప్పక జరుగుతుంది. అప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారవుతాయి. ఇప్పటి వరకూ ఉన్న లెఖ్ఖల ప్రకారం కోవూరు నియోజక వర్గంలో ఎస్టీ ఓటర్లు ఎక్కవగా ఉన్నారు. దీని ప్రకారం కోవూరు ఎస్టీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. దీంతో నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సీటు గల్లంతవుతుందనేది రాజకీ వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: