కరోనా ఏమాత్రం తగ్గనంటోంది... కాస్త జలుబు, దగ్గు లేదా జ్వరం వుందా వారికి టెస్ట్ చేస్తే పాజిటివే మరి ఆ రేంజ్ లో వ్యాప్తి శరవేగంగా కొనసాగుతోంది. దేశంలో ఒమిక్రాన్‌ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. కోకొల్లలుగా కేసులు పెరుగుతూ పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది అనుకునే లోపే థర్డ్‌ వేవ్‌ రూపంలో ప్రళయం సృష్టిస్తోంది. ఇప్పట్లో దీని వేగం తగ్గేలా కనిపించడం లేదు. వేగం, కేసుల సంఖ్య చూస్తుంటే
ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రతి మనిషికి ఖచ్చితంగా సోకుతుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారు. వారి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి అంటే..!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ హెడ్ మారియా వాన్ కెర్‌ఖోవ్ , కోవిడ్-19 కు చెందినటువంటి ప్రశ్నలకు స్పందిస్తూ ఇలా సమాధానమిచ్చారు.

కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కరోనా కంటే తక్కువ తీవ్రతను కలిగి ఉండటం నిజమే, అయితే ఒమిక్రాన్‌ ను ఇపుడే తక్కువ అంచనా వేయలేము ఎపుడు పరిస్థితులు ఎలా మారుతాయి చెప్పలేం. WHO సాంకేతికత మారియా వెన్ ప్రకారం తెలుస్తోంది ఏమిటంటే.. ఒమిక్రాన్ బాధితుల్లో వైరస్ తీవ్రంగా మారే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. ఈ వైరస్‌ సంక్రమణ తీవ్రమైతే మరణానికి కూడా దారి తీసే అవకాశం ఉంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులకు ఎక్కువగా ఒమిక్రాన్ సంక్రమిస్తే  ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందరికీ ఒమిక్రాన్ సోకుతుందా అంటే... వైరస్ వ్యాప్తి చాలా వేగంగా వుంది, అత్యంత జాగ్రత్త లేకపోతే వైరస్ నుండి తప్పించుకోవడం కష్టమే అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలలోనూ వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఏపి లో కరోనా కేసులు నిత్యం వేలల్లో నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: