ఒకప్పుడు ఏదైనా ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలంటే బ్యాంకు కి వెళ్లడం లేదా ఎటిఎంల ద్వారా మాత్రమే జరిపేవారు. కానీ ఇటీవల కాలంలో ఎంతోమంది మొబైల్ ద్వారానే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు అన్న విషయం తెలిసిందే.అదే సమయంలో అటు డెబిట్ క్రెడిట్ కార్డుల వినియోగం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా కరోనావైరస్ కాలంలో ఏకంగా ఆన్లైన్ పేమెంట్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు జనాలు. ఇదే సమయంలో అటు సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే.

 జనాలను బురిడీ కొట్టించడానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటు ఉన్నారు. మాయ మాటలతో నమ్మించి ఖాతాలు ఖాళీ చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. మహారాష్ట్ర లో ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు వాడి ఏకంగా మోసపోయాడు. ఫేస్బుక్ ఓపెన్ చేసిన సమయంలో వంద రూపాయలకు మీల్స్ ఆర్డర్ చేస్తే రెండు మిల్స్ ఫ్రీ గా వస్తాయి అంటూ ఆఫర్ చూశాడు. ఈ క్రమంలోనే మీల్స్ ఆర్డర్ చేసి క్రెడిట్ కార్డుతో 10 రూపాయలు చెల్లించారు. ఇక మిగిలిన 90 రూపాయలు ఫుడ్ డెలివరీ అయిన తర్వాత చెల్లిస్తా అని అనుకున్నాడు.



 ఈ క్రమంలోనే ఆర్డర్ చేస్తుండగా సైబర్ నేరగాళ్లు కార్డు నెంబర్ చెప్పాలని కోరారు. ఇక ఆ తర్వాత మాటల్లో పెట్టి ఓటిపి కూడా తెలుసుకున్నారు. ఇక ఆ తరవాత నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా 47 వేల రూపాయలు పోయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా షాకయ్యాడు సదరు వ్యక్తి. మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు కూడా తమ కార్డు నెంబర్లను మరీ ముఖ్యంగా ఓటీపీ నెంబర్లను ఎవరితో షేర్ చేసుకోకూడదు అంటూ చెబుతున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: