అమరావతి :  నాపై సీఐడీ కేసు నమోదైందనేది ఇది పాత సబ్జెక్ట్ అని... చిన్న టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల నేరం కింద పరిగణించి నేను ఎన్జీవో సంఘంలో ఉండగా నా ప్రత్యర్థులు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు నమోదైందని వెల్లడించారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు. డి కామ్ అనేది బి కామ్ గా టైప్  మిస్టేక్ వల్ల నా ప్రత్యర్ధులు నా పై ఫిర్యాదు చేశారన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.  దీనిపై డిపార్టుమెంటల్ ఎంక్వైరీ కూడా జరిగింది... 2019లో స్పష్టంగా నేరపురితంగా గాని  ఎలాంటి బెనిఫిట్స్ గాని ఏమి లేవని టెక్నీకల్ మిస్టేక్ వల్లే జరిగిందని.. దానికి పనిష్మెంట్ అవసరం లేదని విచారణాధికారి రిపోర్ట్ కూడా ఇచ్చారని చెప్పారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఆర్గనైజేషన్లో వైరం వల్ల టీడీపీలో ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేని వారు లోకాయుక్తకు ఓ ఉద్యోగితో ఫిర్యాదు చేయించారు.ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ ప్రోద్బలంతోనే ఇది జరిగిందన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.  


రాజకీయంగా నన్ను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారు... సూర్యనారాయణ ప్రభుత్వ మనిషి అని చెప్పారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.   అతను జీరో.. ప్రభుత్వం హీరో చేసింది... అతను డిపార్ట్మెంట్ టెస్ట్ కూడా పాస్ కాలేదన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు. దీనిపై చట్టబద్ధంగా పోరాడతాం... రాజకీయ కుట్రతోనే నాపై తప్పుడు కేసు పెట్టారన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.  నేను భయపడేది లేదు దీనిపై సీబీఐ విచారణ కూడా చేసుకోవచ్చని.. దీని గురించి ఉద్యోగులందరికి ఈ విషయం తెలుసు పేర్కొన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.  ఉద్యోగ సంఘాల్లో పనిచేసినందుకే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది ఇది సరి కాదు... ఉద్యోగుల ఆందోళనను ప్రక్కదారి పట్టించేందుకే దీనిని తెరపైకి తెచ్చారని వెల్లడించారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.
2019 లోనే విషయం క్లోజ్ అయింది.దీనిపై ముందుగా లోకాయుక్త నోటీస్ ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: