అమరావతి : నాపై సీఐడీ కేసు నమోదైందనేది ఇది పాత సబ్జెక్ట్ అని... చిన్న టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల నేరం కింద పరిగణించి నేను ఎన్జీవో సంఘంలో ఉండగా నా ప్రత్యర్థులు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు నమోదైందని వెల్లడించారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు. డి కామ్ అనేది బి కామ్ గా టైప్ మిస్టేక్ వల్ల నా ప్రత్యర్ధులు నా పై ఫిర్యాదు చేశారన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు. దీనిపై డిపార్టుమెంటల్ ఎంక్వైరీ కూడా జరిగింది... 2019లో స్పష్టంగా నేరపురితంగా గాని ఎలాంటి బెనిఫిట్స్ గాని ఏమి లేవని టెక్నీకల్ మిస్టేక్ వల్లే జరిగిందని.. దానికి పనిష్మెంట్ అవసరం లేదని విచారణాధికారి రిపోర్ట్ కూడా ఇచ్చారని చెప్పారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఆర్గనైజేషన్లో వైరం వల్ల టీడీపీలో ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేని వారు లోకాయుక్తకు ఓ ఉద్యోగితో ఫిర్యాదు చేయించారు.ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ ప్రోద్బలంతోనే ఇది జరిగిందన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.
2019 లోనే విషయం క్లోజ్ అయింది.దీనిపై ముందుగా లోకాయుక్త నోటీస్ ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలన్నారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు.