డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ రక్షణ అని తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  అంబేద్కర్  రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకున్న సందర్భంగా    రాష్ట్ర ప్రజలకు  శుభాకాంక్షలు తెలిపారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబెద్కర్ స్ఫూర్తి అజరమారమని ఆయన కొనియాడారు. దేశంలో అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం  భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క.  

భారత రాజ్యాంగం దేశంలోని సకల సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పారు సీ ఎ ల్పీ లీ డర్ భట్టి  విక్ర మార్క. భారత రాజ్యాం గాన్ని సంపూర్ణం గా అమలు చేస్తే  దేశం లో సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లి విరుస్తుం దని వివరించారు సీఎల్పీ లీడర్ భ ట్టి విక్ర మార్క. సమాజం మీద ఆధిపత్యం చేయాలనుకునే కుట్ర దారులు భారత రాజ్యాంగా న్ని అమలు చేయ కుండా బలహీన పరిచే ప్రయత్నం చేస్తు న్నారని విమర్శించారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. భారత రాజ్యాంగాన్ని అమలు చేసి దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని అమలు చేయాలని ఇప్పుడు బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయని ధ్వజ మెత్తారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. లౌకిక వాదులు, దేశభక్తులు మనువాద కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. ప్రజాస్వామిక వాదులు, సమతా వాదులు భారత రాజ్యాంగాన్ని రక్షించుకుని దేశాన్ని సమానత్వంలో ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు భట్టి విక్రమార్క.

మరింత సమాచారం తెలుసుకోండి: