బాధ్య‌త‌గా ఏమ‌యినా అడిగితేనే కేంద్రం నిధులు ఇవ్వ‌దు.బాధ్య‌త‌గా అడిగినా కూడా కొన్ని సార్లు ప‌ట్టించుకోదు కూడా!అలాంటిది అస్స‌లు ఏమీ అడ‌గ‌కుండానే నిధులు ఎందుకు ఇవ్వాలి?ఎందుకు ఇస్తుంద‌ని? ఇప్పుడిదే టాపిక్ డిస్క‌ష‌న్ పాయింట్ అవుతోంది.వ‌చ్చే బ‌డ్జెట్ కు సంబంధించి మ‌నం ఏం అడ‌గాలి వాళ్లేం ఇవ్వాలి అన్న విష‌యాల‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి స్ప‌ష్ట‌తా లేదు. ఇప్ప‌టికే విభ‌జ‌న హామీలు తుంగ‌లో తొక్కిన విధంపై విమ‌ర్శ‌లున్నా అవేవీ కేంద్రం చెవికెక్కవు. మ‌న‌కేకాదు తెలంగాణ విష‌యంలో కూడా విభ‌జ‌న హామీల అమ‌లు అన్న‌ది స‌రిగా లేదు అన్న‌ది సుస్ప‌ష్టం.ముఖ్యంగా వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణ‌యాలు ఇవ్వాల్సిన నిధులు వీట‌న్నింటిపై కేంద్రాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌తింపుల ద్వారా దార్లోకి తేవాలి. తెస్తున్నారా?
 

ఏటా కేంద్ర బ‌డ్జెట్ నుంచి మ‌నం ఆశించేదేమీ ఉండ‌దు ఎందుకంటే మ‌నం కోరుకున్నా,కోరుకోక‌పోయినా ప‌న్నుల స‌ర్దుబాటు త‌ప్ప మ‌న ద‌గ్గ‌రకు పెద్ద‌గా నిధులు రావు. ఉత్త‌రాదిలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వాళ్ల‌కే నిధులు విదిల్చి మ‌న‌కు బూడిద అంటిస్తారేమోన‌న్న అనుమానాల‌ను ప్ర‌బ‌లంగా ఉన్నాయి ఆర్థిక నిపుణుల్లో! ఈ ద‌శ‌లో కేంద్రాన్ని ఒత్తిడి చేయ‌డం కాదు కదా! క‌నీసం ఓ లేఖ రూపంలో కూడా అడిగేందుకు యువ ముఖ్య‌మంత్రి ఆస‌క్తి చూప‌డం లేదు.


ఇదే స‌మ‌యంలో ప‌క్క రాష్ట్రం అయిన తెలంగాణ ఇప్ప‌టి నుంచే అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.లేఖ‌ల మీద లేఖ‌లు రాస్తోంది. త‌మ‌కు రావాల్సిన నిధులు ఇవ్వ‌కుండా స‌మాఖ్య స్ఫూర్తిని బీజేపీ  స‌ర్కారు చెడ‌గొడుతుంద‌ని అంటోంది.ఇదే స‌మ‌యంలో లేఖ‌ల‌తో పాటే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కూడా న‌డుపుతోంది.ఇవేవీ ప‌ట్ట‌ని మ‌న‌కు నిధులు ఎలా వ‌స్తాయి? సాయిరెడ్డి,మిథున్ రెడ్డిలాంటి పెద్ద‌లారా! ఓ సారి ఆలోచించండి.


రెండే రెండు హామీల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.ఒక‌టి ప్ర‌త్యేక హోదా రెండు రైల్వేల‌కు సంబంధించి ప్ర‌త్యేక జోను. ఈరెంటిపై కేంద్రం ఇప్ప‌టిదాకా క‌ప్ప‌దాటు వ్య‌వ‌హారమే త‌ప్ప స్ప‌ష్టం అయిన విధానాన్నివెలువ‌రించిన పాపానికి పోలేదు.కేంద్రంతో క‌య్యం పెట్టుకుంటే మ‌నం నెగ్గ‌లేం ? అన్న ఆలోచ‌న ఒక‌టి జ‌గ‌న్ కు ఉంటే ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేరు.. ఎందుకంటే మ‌న‌వైపు నుంచి ఒత్తిడి లేకుండా మ‌న త‌ర‌ఫు నుంచి వాద‌న లేకుండా కేంద్రం నుంచి సాయం కాదు క‌దా! హ‌క్కుగా రావాల్సిన వాటిని కూడా ద‌క్కించుకోవ‌డం అన్న‌ది ఇవాళ అసాధ్యం.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp