ఇంతవరకు ఏపీ చరిత్రలో ఏ సీఎం తీసుకోని విధంగా..సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే...జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ సంచలన నిర్ణయమే అన్నట్లు ఉంది. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో జనాల ఊహాకే అందడం లేదు. అలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఇది జనం ఊహించలేదు..అలాగే వారు కోరుకోలేదు కూడా. అయినా సరే మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని చెప్పి, మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని జగన్ చెప్పారు.

అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి...అమరావతి ప్రజలు వ్యతిరేకించడమే కాకుండా..దీనిపై ఉద్యమం చేస్తున్నారు. సరే ఎవరేం చేసిన మూడు రాజధానులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని జనం భావించారు. మూడు రాజధానులు ప్రకటించి రెండేళ్ళు దాటినా సరే రాష్ట్రంలో అభివృద్ధి లేదు...అసలు రాష్ట్రానికి అంటూ ఒక రాజధాని చెప్పుకోవడానికి లేదు. మూడు రాజధానుల బిల్లులో లోపాలు ఉన్నాయని, మళ్ళీ తప్పులు సరి చేసి కొత్త బిల్లుతో వస్తామని జగన్ చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో...ఎప్పుడు మూడు రాజధానులు వస్తాయో క్లారిటీ లేదు.

ఈ మూడు రాజధానుల మధ్యలో రెవెన్యూ డివిజన్లు అంటూ కొత్త అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లు చేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. అది కనబడటం లేదు. ఇప్పుడు జిల్లాల విభజన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇది ముందు నుంచి నలుగుతున్న అంశమే. అయితే ఇప్పుడు 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. ఉగాది లోపు జిల్లాల ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తున్నారు.

కాకపోతే జనగణన పూర్తి కాకుండా జిల్లాల విభజన చేయడానికి వీల్లేదని కేంద్రం ఆదేశాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు జిల్లాల విభజన కూడా ఇప్పటిలో అయ్యేలా లేదు. అంటే ఈ జిల్లాల విభజన ఎప్పటికి అవుతుందో...అసలైన రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: